లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

మాస్క్ లేక పోతే రూ.2వేల జరిమానా

Published

on

kejriwal mask

Rs. 2,000 Fine For Not Wearing Mask In Delhi : దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ కేసులు ఆందోళన కలిగించే స్ధాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేజ్రీవాల్ సర్కార్ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇక నుంచి ఢిల్లీలో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్‌లు ధ‌రించ‌ని వారిపై రూ.2 వేలు జ‌రిమానా విధించ‌ాలని నిర్ణయించారు. గ‌తంలో రూ.500 ఉన్న ఫైన్‌ను ఏకంగా రెండు వేల‌కు పెంచేశారు. ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సీఎం సీఎం కేజ్రీవాల్‌.. ఈ రోజు అఖిల ప‌క్ష పార్టీ నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

అనంత‌రం విలేకరులతో మాట్లాడుతూ ఆయన…. మాస్క్ ధ‌రించ‌ని వారికి రెండు వేలు జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు చెప్పారు. మరోవైపు ..ఢిల్లీలో కేసులు పెరుగుతుంటే ఎలా మౌనంగా ఉండిపోయార‌ని.. ఇవాళ హైకోర్టు కూడా కేజ్రీ స‌ర్కార్‌కు మొట్టికాయ‌లు వేసింది. దీంతో ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వం కొర‌డా రుళుపించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న వేళ ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని, రాజ‌కీయాల‌కు తావు లేకుండా అందరూ ప్ర‌జ‌ల క్షేమం కోసం ప‌నిచేయాల‌ని సీఎం పిలుపునిచ్చారు.


ప్రజలందరూ మాస్క్ లు తప్పని సరిగా ధరించి బయటకు రావాలని చెప్పారు. ఈనెలలో వచ్చే చాత్ పూజను అందరూ సామూహికంగా కాకుండా ఇంటివద్దే జరుపుకోవాలనిసూచించారు. అందరూ ఒకేసారి చెరువు వద్దకు, నది వద్దకూ వస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశంఉన్నందున సాధ్యమైనంతవరకు ఇంటివద్దే చాత్ పూజ చేసుకోవాలని కోరారు.


గత వారం రోజులుగ్ ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య11 శాతం పెరిగిందని లెక్కలు చెపుతున్నాయి. ఢిల్లీలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ల సంఖ్యను పెంచుతున్నామని, మరోసారిలాక్ డౌన్ విధించే విషయమై వ్యాపారవర్గాలతో చర్చిస్తామని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. కోవిడ్ రోగుల కోసం అదనంగా 1400 పడకలను ప్రభుత్వం సిధ్దం చేస్తోందని ఆయన తెలిపారు.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *