Rs 85,000 crore allocation for SC and OBCs in 2020-21

బడ్జెట్ 20-21 : ఎస్సీలకు 9 వేల 500 కోట్లు, ఎస్టీలకు రూ. 53 వేల 700 కోట్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బడ్జెట్‌ (2020 – 2021) ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా పలు రంగాలకు కేటాయింపులు జరిపారు. SC, OBCలకు కలిపి రూ.85 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే..ఎస్టీల సంక్షేమానికి రూ. 53 వేల 700 కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా…సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు రూ. 9 వేల 500 కోట్లు కేటాయింపులు చేశారు. 

ప్రసంగం మొదటిలో సామాన్యుల బడ్జెట్ అని చెప్పారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో బడ్జెట్‌ను తీసుకొచ్చామని వెల్లడించారు. ఆదాయల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్ తీసుకొచ్చామన్నారు. యువతను శక్తివంతం చేసేలా ప్రభుత్వం ప్రాధామ్యాలు ఉంటాయన్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని చెప్పారు. అంతేగాకుండా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడగు వేస్తున్నామన్నారు. 

* కేంద్ర బడ్జెట్‌ను రెండోసారి ప్రవేశపెడుతున్న తొలి మహిళగా ఘనత సాధించారు నిర్మలా. 
* నిర్మలమ్మ బడ్జెట్ వినేందుకు ఆమె కుమార్తె వాజ్మయి పార్లమెంట్‌కు రావడం విశేషం. 
* ఆమెతో పాటు నిర్మలా కుటుంబసభ్యలు విచ్చేశారు. 

* పార్లమెంట్ సిబ్బంది, అధికారులు వీరిని సాదారంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. 
* పార్లమెంట్‌కు వచ్చే ముందు నిర్మలా బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిశారు. 
 

* అటు బడ్జెట్‌ను ఆమోదించేందుకు కేంద్ర మంత్రివర్గం కూడా సమావేశమైంది. 
* బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. 

Read More : కేంద్ర బడ్జెట్ 2020-21.. కేటాయింపులు ఇలా

Related Posts