rtc services to start in telangana

తెలంగాణలో రోడ్డెక్కనున్న బస్సులు, నగర శివార్ల నుంచే జిల్లాలకు, MGBSకు వచ్చే బస్సులకు నో ఎంట్రీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి(మే 19,2020) నుంచి

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి(మే 19,2020) నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయి. భౌతికదూరం పాటిస్తూ 50శాతం సీటింగ్ తో బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో ఆరెంజ్, గ్రీన్ జోన్లలో బస్సులు తిరగనున్నాయి. ఆర్టీసీ నష్టాల్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, అంతరాష్ట్ర సర్వీసులకు మాత్రం ఇప్పట్లో అనుమతి లేనట్లుగానే తెలుస్తోంది. ఈ సాయంత్రం కేబినెట్ భేటీ తర్వాత ఆర్టీసీ సర్వీసులపై సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన చేయనున్నారు.

* తెలంగాణలో రేపటి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు
* అన్ని జిల్లాల్లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో రేపటి నుంచే బస్సు సర్వీసులు
* అంతర్రాష్ట్ర సర్వీసులు ఇప్పట్లో లేనట్లే
* హైదరాబాద్ సిటీ సర్వీసులపై ఇంకా సస్పెన్స్
* నగర శివార్ల నుంచి జిల్లాలకు బస్సు సర్వీసులు
* బస్సుల్లో 50శాతం సీట్లలోనే ప్రయాణికులు
* ప్రతి బస్సులో శానిటైజర్లు, మాస్కులు
* హైదరాబాద్ లో జేబీఎస్ వరకే బస్సు సర్వీసులు
* వరంగల్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి
* నల్గొండ వైపు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి
* మహబూబ్ నగర్ వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్ నుంచి నడిపే అవకాశం
* ఎంజీబీఎస్ నుంచి వచ్చే బస్సులకు నో ఎంట్రీ
* డిపోల్లో థర్మల్ స్క్రీన్ చేశాకే ఆర్టీసీ కార్మికులు విధులోకి

నష్టాల్లో ఆర్టీసీ, అందుకే గ్రీన్ సిగ్నల్:
దాదాపు రెండు నెలలు.. లాక్ డౌన్ కారణంగా ప్రజారవాణ సర్వీసులు మూత పడ్డాయి. తెలంగాణలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. కాగా, లాక్ డౌన్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం ప్రజారవాణా అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల పరస్పరం ఒప్పందం మేరకు బస్సులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నడపొచ్చని కేంద్రం తెలిపింది. కేంద్రం ఇచ్చిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సులను నడపాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదే సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రయాణీకుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

లాక్ డౌన్ 4లో కేంద్రం ఇచ్చిన సడలింపులతో అన్ని కార్యాలయాలు దాదాపుగా తెరుచుకున్నాయి. దీంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురి కాకుండా ఆర్టీసీ తగు చర్యలు చేపట్టనుంది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధానికి నడిపే బస్సుల్లో పరిమితంగా ప్రమాణీకులను అనుమతిస్తారు. దాంతో పాటు వ్యక్తిగత దూరం పాటించేందుకు వీలుగా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేశారు.

READ  హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు రావొచ్చు..!

Read : మరో మూడు నెలలు థియేటర్లు బంద్!

Related Posts