RTC workers preparing to join in duties

ముఖ్యమంత్రి పిలుపు: విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సీఎం కేసీఆర్ పిలుపుతో ఆర్టీసీ కార్మికులు కదిలివస్తున్నారు. విధుల్లో చేరేందుకు ఈనెల 5వ తేదీ వరకు ముఖ్యమంత్రి గడువు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా డిపోలకు చేరుకుంటున్నారు.

గత నెల రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు విధుల్లో చేరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ భేటి అనంతరం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగంలో చేరుతున్నారు కొందరు ఉద్యోగులు. పోలీసులు కూడా ఉద్యోగాల్లో చేరినవారికి భద్రత కల్పిస్తామంటూ హామీ ఇవ్వడంతో విషయాన్ని గ్రహించిన ఉద్యోగులు తమ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయా డిపోల్లో సమ్మతి పత్రాలు ఇచ్చి, విధుల్లో చేరేందుకు సిద్దమయ్యారు కార్మికులు.

నవంబర్ 5వ తేదీ వరకు సీఎం కేసీఆర్ విధుల్లో చేరేందుకు గడువు ఇవ్వగా రాష్ట్రవ్యాప్తంగా డిపోలకు చేరుకుంటున్నారు కార్మికులు. నెల రోజులుగా చేస్తున్న సమ్మెకు స్వచ్ఛందంగా గుడ్‌ బై చెప్పేసి డ్యూటీలో జాయిన్ అవుతున్నారు. ఓవైపు ఆర్టీసీ సంఘాలు సమ్మె ఉధృతం చేస్తామని ప్రకటిస్తుంటే… మరోవైపు కార్మికులు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు విధుల్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం ఉద్యోగంలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు విధుల్లో చేరేందుకు ఆయా డిపోలకు చేరుకున్నారు. శనివారం (నవంబర్ 2, 2019) జరిగిన కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు వారు ఉద్యోగంలో చేరేందుకు సన్నద్దమౌతున్నారు. నవంబర్‌ 5 అర్ధరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు బేషరతుగా ఉద్యోగాల్లో చేరితే, వారి భవిష్యత్‌ బాగుపడుతుందనీ.. అడ్డగోలు యూనియన్ల నిర్ణయాల వల్ల తమ జీవితాల్ని, కుటుంబాల్ని నాశనం చేసుకోవద్దని సీఎం సూచించారు.

విధుల్లో చేరకపోతే మళ్లీ తీసుకునేది లేదని కరాఖండిగా సీఎం చెప్పడంతో ఉద్యోగులు రాష్ట్రంలోని చాలా బస్‌ డిపోల దగ్గరకు చేరకుని విధుల్లో చేరుతున్నారు. ఉప్పల్‌, కామారెడ్డి, హయత్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, భద్రాచలం, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌ డిపోల దగ్గరకు కార్మికులు విధుల్లో చేరేందుకు వచ్చారు. కార్మికులను యూనియన్‌ నాయకులు బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Related Posts