కుమురంభీం అడవుల్లో వలస విన్యాసం : కనువిందు చేస్తున్న అరుదైన పక్షి ‘రూఫస్ బెల్లీడ్’..!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలోని కుమురం భీం జిల్లా అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి కనిపించి కనువిందు చేసింది. గద్ద జాతికి చెందిన రూఫస్ బెల్లీడ్ అనే అరుదైన పక్షిగా అధికారులు గుర్తించారు. పొడవైన రెక్కలు,పొడవై తోకతో ఆకర్షించేలా ఉన్న ఈ పక్షి జిల్లాలోని పెంచికల్‌పేట మండలం నందిగాం అటవీ ప్రాంతంలోని పాలరాపుగుట్ట ప్రాంతంలో కనిపించిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. అది కనిపించిన వెంటనే కెమెరాతో క్లిక్ మనిపించారు.

తెలంగాణ ప్రాంతానికి ఈ రూఫస్ బెల్లీడ్ పక్షి వలస రావడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. ఈ పక్షులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లితోపాటు అసోం, పశ్చిమ కనుమలలో కనిపిస్తుంటాయని పెంచికల్‌పేట అటవీ రేంజ్ అధికారి వేణుగోపాల్ తెలిపారు. కాగా..పక్షలు వలసలు వెళ్లటం సర్వసాధారణం. వేలకొద్దీ కిలోమీటర్లు దూరం కూడా పక్షులు వలసలు వెళుతుంటాయి. సంతానాన్ని అభివృద్ధి చేసుకోవటానికి..ఆహారం సమృద్ధిగా ఉండటం కోసం..వాతావరణ అననుకూలత నుంచి తప్పించుకోవడం కోసం ఇలా పలు కారణాలతో పక్షులు వలసలు పోతుంటాయి.

వలస పక్షుల దినోత్సవం
వలస పక్షుల కోసం యునెస్కో ప్రత్యేకించి పాటిస్తోంది యునెస్కో. 2006 నుంచి వలస పక్షుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. పక్షుల అవసరాలు, అలవాట్లు, వలస వెళ్లే ప్రాంతాల్లో వాటికి ఎదురవుతున్న సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వలస పక్షుల ప్రదేశాల రక్షణ గురించి ప్రచారం చేస్తూ స్తానికుల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు.

Related Posts