లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

RRR మూవీపై రూమర్స్ : ప్రభాస్ గెస్ట్ రోల్

టాలీవుడ్ జక్కన్న ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ RRR మూవీ హీరోయిన్ పై ఇంకా క్లారిటీ కనిపించడం లేదు.. రామ్ చరణ్ కు సరైన జోడీ కుదిరినా.. ఎన్టీఆర్ కు మాత్ర జత కుదరడం లేదు..

Published

on

Rumors on the RRR movie

టాలీవుడ్ జక్కన్న ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ RRR మూవీ హీరోయిన్ పై ఇంకా క్లారిటీ కనిపించడం లేదు.. రామ్ చరణ్ కు సరైన జోడీ కుదిరినా.. ఎన్టీఆర్ కు మాత్ర జత కుదరడం లేదు..

టాలీవుడ్ జక్కన్న ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ RRR మూవీ హీరోయిన్ పై ఇంకా క్లారిటీ కనిపించడం లేదు.. రామ్ చరణ్ కు సరైన జోడీ కుదిరినా.. ఎన్టీఆర్ కు మాత్ర జత కుదరడం లేదు.. ఇప్పటికే రెండు షెడ్యూళ్ళను కంప్లీట్ చేసుకున్న మూవీపై గంటకో రూమర్.. పూటకో పుకారు వినిపిస్తోంది.

రాజమౌళి ఈ మూవీ ఎనౌన్స్ చేసినప్పటి నుండి..ఏదో ఒక రకంగా న్యూస్ అవుతూనే ఉంది. 400 వందల కోట్లకు పైగా బడ్టెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీకి ఏక్కడో ఒక చోట బ్రేక్ పడుతూనే ఉంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఎంత ప్రయత్నించినా సినిమాను ఫుల్ పిల్ చేసే బ్యూటీలు సెట్ అవ్వడం లేదు. చరణ్ కు జోడీగా బాలీవుడ్ తార ఆలియా బట్ కన్ఫాం అయ్యింది. ఆలియా విషయంలో కూడా చాలా రోజులు వెయిట్ చేసి, డేట్ అజస్ట్ మెంట్ చేసుకోవలసి వచ్చింది. ఆలియా కంటే ముందు పరిణితీచోప్రా ఈ క్యారక్టర్ చేయబోతోందని రూమర్ గట్టిగా వినిపించింది. ఇక ఎన్టీఆర్ పక్కన బ్రిటీష్ మోడల్ డేసీ ఎడ్గర్ నటిస్తుంది అని ఫిక్స్ అవగా.. ఆమె రీసెంట్ గా ఈ ప్రాజక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలిసింది.
Read Also : మహిళను ఈడ్చుకెళ్లిన మెట్రో రైలు : తలకు తీవ్రగాయాలు

మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సరిజోడిగా నటించబోయేది ఎవరు. రీసెంట్ గా నిత్యా మీనన్ ను టెస్ట్ కట్ చేసి ఈ సినిమా కోసం తీసుకున్నాడు రాజమౌళీ.. అయితే ఆమె ఎన్టీఆర్ పక్కన మెయిన్ హీరోయిన్ కాదని తెలుస్తోంది. కొమురం భీం పాత్రలో కనిపించబోయే ఎన్టీఆర్ కి హీరోయిన్ ను వెతికే పనిలో బిజీగా ఉన్నాడు జక్కన్న. రామ్ చరణ్ కోసం ఆల్ రెడీ బాలీవుడ్ బ్యూటీ ఆలియాను సెలక్ట్ చేసిన రాజమౌళీ. ఎన్టీఆర్ పక్కన చేయడానికి మరో బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ ను మాట్లాడినట్టు తెలుస్తుంది. శ్రద్దా కపూర్ ఆల్ రెడీ ప్రభాస్ తో కలిసి సాహోలో నటిస్తోంది. వీటితో పాటు బాలీవుడ్ లో మరో రెండు ప్రాజక్ట్స్ తో బిజీ బిజీగా ఉంది. ఈ సినిమా కోసం డేట్లు అడ్జెస్ట్ చేస్తుందో లేదో చూడాలి..

శ్రద్ధా కపూర్ సినిమాలో చేయడానిక ఒప్పుకుంటే ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఒకే సారి ఒక తెలుగు సినిమాలో నటించడం ఫస్టైం అవుతుంది. మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ లు తెలుగు సినిమాలో, అదీ రాజమౌళీ సినిమాలో నటిస్తున్నారు అంటే ఇండియా అంతా ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి. రీసెంట్ గా మూవీ నుండి మరో రూమర్ ఆడియన్స్ లో స్పెషల్ ఇంట్రస్ట్ ను క్రియేట్ చేస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మూవీలో గెస్ట్ రోల్ చేయబోతున్నట్టు న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. మరి నిజంగానే ఈ మూవీలో ప్రభాస్ కనిపించబోతున్నాడా.. అనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
Read Also : లారెన్స్ దెయ్యం సినిమాల సీక్వెల్స్

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *