లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ప్రసవించిన 14ఏళ్ల బాలిక..పసిగుడ్డును కవర్ లో పెట్టి ఫ్రీజ్ లో దాచేసింది

Published

on

Russia : 14 ఏళ్ల బాలిక గర్భందాల్చింది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పటానికి భయపడింది. తెలిస్తే ఏంమంటారో ఏంచేస్తారోనని భయపడింది. ఈక్రమంలో ఓరోజు పురిటి నొప్పులు రావటంతో మగబిడ్డను ప్రసవించింది. పుట్టిన ఆ పసిగుడ్డును ఏంచేయాలో తెలియలేదు. అమాయకత్వమో..లేదా అతి తెలివో తెలీదు గానీ ఆ పుట్టిన శిశువును కవర్ లో చుట్టి ఫ్రిజ్ లో పెట్టేసింది.


వివరాల్లోకి వెళితే..రష్యాలోని సైబీరియా ప్రాంత నోవోసిబిర్క్సు నగరానికి సమీపంలోని వర్ద్ తులా గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి ఇంట్లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ గురించి తల్లిదండ్రులకు చెప్పటానికి భయపడి ఆ నవజాత శిశువును ప్లాస్టిక్ సంచిలో పెట్టి..తండ్రి గ్యారేజ్ లో ఉన్న ఫ్రిజ్ లో పెట్టేసింది. ఆ సమయంలో తండ్రి తోటపనిలో ఉండటంతో అది గమనించలేదు.


ఆ తరువాత బాలికకు రక్తస్రావం జరగటంతో అది చూసిన తల్లి కంగారుపడిపోయింది. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసిన కూతురుని హాస్పిటల్ కు తీసుకెళ్లింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చిందనీ అందుకే రక్తస్రావం అవుతోంది తెలిపారు.


దీనిపై బాలికను ప్రశ్నించగా..నిజమేననీ చెప్పింది. మరి పుట్టిన బిడ్డ ఏదీ అని అడగ్గా ఆ శిశువును తండ్రి గ్యారేజీలోని ఫ్రిజ్ లో పెట్టానని చెప్పింది. దీంతో వెంటనే ఇంటికెళ్లి ఫ్రిజ్ లో చూడగా అప్పటికే ఆ పసిగుడ్డు చనిపోయి ఉంది. మరో పక్క అతి చిన్న వయస్సులోనే గర్భం దాల్చటం బిడ్డకు జన్మనివ్వటంతో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.



అదే విషయాన్ని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం హాస్పిటల్ లో బాలిక చికిత్స పొందుతుంది. కానీ పరిస్థితి మాత్రం విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *