లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

రష్యాలో వ్యాక్సినేషన్ మొదలైంది..

Published

on

Russia Coronavirus Vaccination Program: కరోనా వైరస్ మహమ్మారితో అతులాకుతలమైన రష్యా సొంత కరోనా వ్యాక్సిన్ తయారుచేసింది. గతంలోనే రష్యా ప్రభుత్వం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఫ్రంట్ లైన్ వర్కర్లకే ముందుగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు రష్యా సొంత కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-V వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ ప్రారంభించింది. వేలాదిగా ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్‌ వర్కర్లు, టీచర్లు, వైరస్‌ ముప్పు అధికంగా ఉండే వారంతా భారీ సంఖ్యలో వ్యాక్సిన్‌లు తీసుకోవడానికి వచ్చారు.అయితే వారందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ప్రత్యేకంగా డజనుకి పైగా వ్యాక్సినేషన్‌ సెంటర్లను ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్‌ 95% పని చేస్తుందని తేలింది. దీంతో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించాలని అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. కానీ, ఈ వ్యాక్సిన్‌పై మూడో దశ ట్రయల్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. టీకా భద్రతపై నిర్దిష్టమైన అంచనాలు రాలేదు.ట్రయల్ పూర్తి కాకుండానే రష్యా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించడంపై అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ప్రతిఒక్కరికి రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి డోసు ఇచ్చిన 21 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు. వ్యాక్సిన్‌ డోసులు ఎన్ని ఉత్పత్తి అయ్యాయో కూడా స్పష్టత లేదంటున్నారు.2020 ఏడాది చివరి నాటికి 20 లక్షల డోసులు ఉత్పత్తి చేస్తామని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. మాస్కోలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య, పాఠశాల సిబ్బందితో పాటు సామాజిక కార్యకర్తలకి ముందుగా టీకా డోసుల్ని ఇస్తున్నారు. శనివారం నుంచే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. అనారోగ్య సమస్యలేవీ లేకుండా 18–60  ఏళ్ల మధ్య వయసున్న వారికి ఉచితంగా వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *