Home » రష్యా కోవిడ్ వ్యాక్సిన్ ను ఏ దేశం కొనుగోలు చేస్తుంది ? ఏమంటున్నాయి దేశాలు
Published
5 months agoon
By
madhuప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది. వ్యాక్సిన్ స్పుత్నిక్-వి పేరుతో సిద్ధమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అయితే..ఈ వ్యాక్సిన్ ను ఏ దేశాలు కొనుగోలు చేస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
స్పుత్నిక్-వి పేరిట పిలువబడే..ఈ టీకాను..Gamaleya Research Institute and the Russian defence ministry తయారు చేశాయి. సమర్థవంతంగా నిరూపించబడిందని, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తోదంటుననారు. ఈ టీకా వేయించుకుంటే రెండేళ్లపాటు కొవిడ్ నుంచి రక్షణ ఉంటుందని ఆయన తెలిపారు.
వ్యాక్సిన్ సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రజ్ఞులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి తొలి దశ పరీక్షల వివరాలే అందుబాటులో ఉన్నాయి. ఫేజ్-1 ట్రయల్స్‌ను 76 మందిపై జూన్ 17న ప్రారంభించారు. రష్యాలో వచ్చిన వార్తా కథనాల ప్రకారం రెండో దశ ట్రయల్స్ జూలై 13న ప్రారంభమయ్యాయి.
ఆ ట్రయల్స్ పూర్తయినట్టు ఆగస్టు 3న ప్రకటించారు. వాటికి సంబంధించిన వివరాలూ వెల్లడించలేదు. మూడో దశ ట్రయల్స్ మొదలుపెట్టక ముందే వ్యాక్సిన్‌ను నమోదు చేసినట్టు ప్రకటించడంతో వ్యాక్సిన్‌పై పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ ను నమ్మడం కష్టమని బ్రిటన్, జర్మని పరిశోధకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా వ్యాక్సిన్ ప్రయోగాలపై ఎలాంటి సమాచారం తెలుపకుండానే…టీకాను రూపొందించినట్లు ప్రకటించడం సబబు కాదంటున్నారు. రష్యా టీకాపై బ్రిటన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తొంది.
రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ను పరశీలిస్తోందని ఇజ్రాయిల్ వెల్లడించింది. వైరస్ ను వ్యాక్సిన్ అరికట్టిందని తేలితే..కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతుందని తెలిపింది.
ఫిలిఫైన్స్ శాస్త్రవేత్తలు టీకాను రూపొందించిన వారిని కలిశారు. క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ ఎలా రూపొందించారనే దానిపై చర్చలు జరిపారు.
బ్రెజిల్ లో ఉన్న రష్యా రాయబారిని కలవడానికి Brazil’s Parana state governor Ratinho Junior భావించారు.
ప్రభుత్వ అధికారులను ఈ నెల చివరి వారంలో మాస్కోకు పంపాలని కజకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది.
కరోన వైరస్ వ్యాక్సిన్ పై రష్యా చేసిన ప్రకటనపై తాను ఆశ్చర్యపోయానని, మరింత సమాచారం రావాల్సి ఉందని మెక్సికోకు చెందిన డిప్యూటీ హెల్త్ మినిస్టర్ హ్యూగో వెల్లడించారు.
రష్యాకు చెందిన అధికారులు, డబ్య్యూహెచ్ వో కు చెందిన అధికారులు ఈ ప్రక్రియపై చర్చిస్తున్నారని WHO ప్రతినిధి వెల్లడించారు. ఇక వ్యాక్సిన్‌కు అనుమతి కోసం చర్చలు జరుగుతున్నాయని, ఎంతవరకూ సురక్షితం అనే అంశంపై సమగ్ర సమీక్ష, అంచనా తర్వాతే అనుమతిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.
మరోవైపు పుతిన్ వ్యాఖ్యలు నిర్లక్ష్యపూరితం, అవివేకంతో కూడుకున్నవని పలువురు శాస్త్రవేత్తలు మండిపడుతున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించకుండా వ్యాక్సిన్‌ను విడుదల చేస్తే ప్రజారోగ్యంపై విపత్కర ప్రభావాలు ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
వ్యాక్సిన్ సామర్థ్యం తక్కువగా ఉంటే ఆ టీకా వేయించుకున్నవారికి వైరస్ సోకితే ఏ మందులకూ, వ్యాక్సిన్లకూ లొంగదని.. మరికొందరు శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రష్యాకే చెందిన అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ ఆర్గనైజేషన్ కూడా.. మూడో దశ ట్రయల్స్ పూర్తయ్యేదాకా ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలపవద్దని రష్యా ఆరోగ్య శాఖకు విజ్ఞప్తి చేసింది.
కాగా.. మూడో దశ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అంటే మూడో దశ పరీక్షలు సాగుతుండగానే టీకాలు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టింది రష్యా.