కరోనాకి ,ఫ్లూ‌కి రష్యా టు ఇన్ వన్ వ్యాక్సిన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

COVID-19 , ఫ్లూ రెండింటికి లక్షణాలు చాలావరకు ఒకటే. ఫ్లూకి వేసే వ్యాక్సిన్ కొంతవరకు కరోనాకు అడ్డుకట్టవేస్తుంది. అందుకే ఈ రెండింటికి ఒకటే వ్యాక్సిన్ ఉంటే?  అందుకే మాస్కో స్టేట్ యూనివర్శిటీ (MSU) వైరాలజిస్టులు పని మొదలుపెట్టారు. ముందడగూ పడింది. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామని అంటున్నారు  MSU వైరాలజీ డిపార్ట్మెంట్ అఫ్ ది బయోలాజికల్ ఫ్యాకల్టీ హెడ్, ప్రొఫెసర్ ఓల్గా కార్పోవా.

ఒకే సమయంలో ఇన్ఫ్లుఎంజా, కరోనా వైరస్‌లకు ఒకటే వ్యాక్సిన్ వేయగాలమా? అసలు అలాంటి టీకా సాధ్యమేనా? అన్న ప్రశ్నకు జవాబు చెప్పాలనుకుంది రష్యా. ఫ్లూకి సీజనల్ వ్యాక్సిన్ వేయొచ్చు. కరోనావైరస్ కనీసం కొన్ని సీజన్లయినా మనతోనే ఉంటుంది. అందుకే మేం సిద్ధం. కరోనాను కట్టడిచేసే కొన్ని మూలపదార్ధాలను మాదగ్గరున్నాయి. ఇప్పటికే ఫ్లూ వ్యాక్సిన్ అభివృద్ధిలో చాలా ముందుకొచ్చాం. అందుకే విజయవంతమైన అన్నింటిని ఒకేచోట చేర్చి టు ఇన్ వన్ వ్యాక్సిన్ తయారుచేయొచ్చన్నది రష్యా నమ్మకం.

Related Posts