ముందు డాక్టర్లు, టీచర్లు. అక్టోబర్‌లో దేశమంతా కరోనా వ్యాక్సినేషన్. రష్యా ప్లాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచానికి గుడ్ న్యూస్.. రష్యా కనిపెట్టిన కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. మొన్నటివరకూ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిన రష్యా.. ఇప్పుడు భారీ మోతాదులో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అంటే.. వచ్చే అక్టోబర్ నెలలోనే దేశమంతా కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తేనుంది.దేశంలో ముందుగా ఈ కరోనా వ్యాక్సిన్‌ను డాక్టర్లు, టీచర్లకు ఇవ్వనున్నారు. అక్టోబర్ నెలలో దేశమంతా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇదే విషయాన్ని మాస్కోలో రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో అక్టోబర్ నెలలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని చెప్పినట్టు స్థానిక వార్తా సంస్థలు నివేదించాయి.

టీకా క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తరువాత… మాస్కోలోని గమలేయ ఇన్స్టిట్యూట్, టీకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిందని తెలిపాయి. టీకాలు వేయించుకునే వారిలో ముందుగా తొలుత వైద్యులు, ఉపాధ్యాయులు అవుతారని ఆయన అన్నారు. అక్టోబర్ నెలలో విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ ప్రజలకు అందేలా ప్లాన్ చేస్తున్నామని మురాష్కో పేర్కొన్నారు. రష్యా మొట్టమొదటి పొటెన్షియల్ COVID-19 వ్యాక్సిన్ ఆగస్టులో స్థానిక నియంత్రణ ఆమోదాన్ని పొందుతుందని చెప్పారు. వెంటనే ఆరోగ్య కార్యకర్తలకు ఇస్తామన్నారు. Gamaleya Institute అడెనోవైరస్ ఆధారిత వ్యాక్సిన్ కోసం పనిచేస్తోంది.వ్యాక్సిన్ మోతాదులపై రష్యా వేగవంతం చేస్తోంది. సోవియట్ యూనియన్ 1957లో ప్రపంచంలోని మొట్టమొదటి శాటిలైట్ Sputnik 1 ప్రయోగానికి టీకాను అభివృద్ధి చేయడంలో రష్యా సాధించిన విజయాలను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అధిపతి Kirill Dmitriev పోల్చారు. రష్యాలో కరోనావైరస్ కారణంగా మరో 95 మంది మరణిచారు. దీంతో మొత్తంగా మరణాల సంఖ్య 14,058కు చేరుకుంది. కరోనా కొత్త కేసులు 5,462 నమోదు కాగా.. మొత్తం 845,443 వరకు కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు.

COVID-19 మహమ్మారిని నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)గణాంకాల ప్రకారం.. కనీసం 4 చివరి హ్యుమన్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. వీటిలో మూడు చైనాలో ఉండగా, మరొకటి బ్రిటన్‌లో కొనసాగుతున్నాయి.

Related Posts