లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

వావ్..ఏమి అందం : పింక్ డైమండ్ ధర రూ. 198 కోట్లు..!!

Published

on

Russia rare pink diamond Rs. 198 crore : అత్యంత అరుదైన లేత గులాబీ రంగు రష్యా వజ్రం (పర్పుల్ పింక్ డైమండ్) ఊహించలేని ధరకు అమ్ముడైపోయింది. స్విట్జర్లాండ్‌లో వేసిన వేలంలో 26.6 మిలియన్ డాలర్లకు అంటే భారత కరెన్సీలో 197.95 కోట్ల రూపాయలు కు అమ్ముడుపోయింది. ఇప్పటివరకు వేలం వేసిన ఇలాంటి వజ్రాల్లో ఇదే అతిపెద్ద అద్భుతమైన, అరుదైన వజ్రం కావటం విశేషం.దాదాపు 99 శాంతి గులాబీ రంగు వజ్రాలు పది క్యారెట్లలోపే ఉంటాయి. కానీ తాజా వజ్రం మాత్రం 14.8 క్యారెట్లు ఉంది. దీన్ని ”ద స్పిరిట్ ఆఫ్ ద రోజ్”గా పిలుస్తున్నారు. ఈ పింక్ డైమండ్ సైజు, రంగుతోపాటు ప్రస్ఫుటంగా కనిపించే వజ్రం అంతర్నిర్మాణమే జెనీవాలో సౌథెబే నిర్వహించిన వేలంలో భారీ ధర పలికేందుకు కారణమైందని నిపుణులు తెలిపారు. కాగా..ఈ వజ్రాన్ని వేలంలో దక్కించుకున్న వ్యక్తి పేరును మాత్రం బయటపెట్టలేదు.


రష్యా మైనింగ్ సంస్థ అల్రోసా సేకరించిన మూడు ప్రముఖమైన వజ్రాల్లో ఇదీ ఒకటి. 2017లో ఇది బయటపడింది. దీని ముడి వజ్రం పేరు నిజిన్‌స్కీ. రష్యా-పోలండ్ బ్యాలే డ్యాన్సర్ పేరును దీనికి పెట్టారు. గులాబీ వజ్రాల్లో అత్యధిర పలికిన రికార్డు ”సీటీఎఫ్ పింక్ స్టార్” పేరిట ఉంది.


59 క్యారెట్ల ఈ వజ్రాన్ని హాంకాంగ్‌లో 2017 ఏప్రిల్‌లో వేలం వేశారు. ఇది రూ.528 కోట్ల(71 మిలియన్ డాలర్లు)కు అమ్ముడుపోయిన ఈ పింక్ డైమండ్ అరుదైన రికార్డు సృష్టించింది. ఈ పింక్ డైమండ్ ప్రకృతిలో అద్భుతమైనది పిలువబడుతోంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *