ఆగస్టు 12న కోవిడ్ వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌కు రష్యా రెడీ.. ప్రపంచంలోనే ఫస్ట్ టీకా..!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అంతా సిద్ధమవుతోంది.. ఇక వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రావడమే మిగిలింది.. ప్రపంచమంతా ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ రానే వచ్చేసింది.. అన్ని ట్రయల్స్ ముగించుకుని ఏకంగా నమోదు ప్రక్రియకు సన్నద్ధమవుతోంది.. ఆగస్టు 12న ప్రపంచంలో మొట్టమొదటి కరోనావైరస్ వ్యాక్సిన్‌ను నమోదు చేయడానికి రష్యా సిద్దమైంది.

గమలేయ పరిశోధనా సంస్థ, రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా టీకాలను అభివృద్ధి చేయడంలో సహకరించాయి. రష్యా COVID-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ డేటా, ఇతర ఫలితాలన్నీ ప్రస్తుతం నిపుణుల సమీక్షలో ఉన్నాయి. వీటి ఫలితాల ఆధారంగానే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌పై నిర్ణయం తీసుకుంటామని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.కరోనా వ్యాక్సిన్ దశ -3 క్లినికల్ ట్రయల్ జరుగుతోందని రష్యా ఉప ఆరోగ్య మంత్రి ఒలేగ్ గ్రిడ్నెవ్ వెల్లడించారు. సీనియర్ సిటిజన్లు, వైద్య నిపుణులు టీకాలు వేసే మొదటివారు అవుతారని ఆయన అన్నారు. రష్యన్ కరోనావైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ రెండు సంస్థలలో జరుగుతోంది. టీకా క్లినికల్ ట్రయల్స్ జూన్ 18న ప్రారంభమయ్యాయి. 38 మంది వాలంటీర్లు ఉన్నారు. వారందరూ రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేశారు. మొదటి గ్రూపులో జూలై 15న, రెండవది జూలై 20న విడుదల

రష్యా కరోనావైరస్ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుంది? :
గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ మాట్లాడుతూ.. టీకా అడెనోవైరస్ ఆధారంగా సృష్టించిన నిర్జీవ కణాలను ఉపయోగించింది. వ్యాక్సిన్ ఒక వ్యక్తి ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదని ఆయన అన్నారు.DNA ఆధారంగా వెక్టర్ టీకా SARS-CoV-2అడెనోవైరస్, సాధారణ జలుబు వైరస్‌.. రష్యన్ శాస్త్రవేత్తల బృందం కరోనావైరస్ నుంచి జన్యు పదార్థాన్ని హానిచేయని క్యారియర్ వైరస్‌లోకి చొప్పిస్తారు. వ్యాధికారకంలోని చిన్న భాగాలను మానవ శరీరంలోకి అందించే రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది.

ఎందుకంటే ఒక విదేశీ యాంటిజెన్ ఇంజెక్ట్ చేసినప్పుడు, టీకాలు వేసిన వ్యక్తి రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.. అప్పుడు కొంతమందికి సహజంగా జ్వరం వస్తుంది. అంటే టీకా పనిచేసినట్టు అర్థం.. క్లినికల్ ట్రయల్స్ సమయంలో, వాలంటీర్ల ఉష్ణోగ్రత 37- 38 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. పారాసెటమాల్ తీసుకోవడం ద్వారా అటువంటి ‘సైడ్ ఎఫెక్ట్’ను పరిష్కరించవచ్చని గింట్స్‌బర్గ్ చెప్పారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ సురక్షితమైన సమర్థవంతమైన టీకాలను ఉత్పత్తి చేయడానికి ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని రష్యాను కోరింది. చైనీస్, రష్యన్లలో ఎవరికైనా వ్యాక్సిన్ ఇచ్చే ముందు వారు టీకాను పరీక్షించాలని సూచించింది.

Related Posts