ఓరి నాయనో..! మనిషి ఎముకలు, పుర్రెలతో ఏకంగా రోడ్డు వేసేశారు..!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Rassia Road with Human Bones,Skull: మట్టి రోడ్లు,కంకర రోడ్లు, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు చూశాం. ప్లాస్టిక్ రోడ్లు కూడా చూసే ఉంటాం.కానీ ఏకంగా మనిషి ఎముకలతో వేసి రోడ్డును మీరు ఎక్కడైనా చూశారా? అంటే ఏంటీ..మనిషి ఎముకలతో రోడ్లా?!..అని కచ్చితంగా ఆశ్చర్యపోతాం. భయపడిపోతాం కూడా. ఇంతకీ మనిషి ఎముకలతో వేసి రోడ్డు ఎక్కడుంది? అసలు అది ఏర్పడింది? అనే విషయం తెలుసుకుందాం..అది రష్యా దేశంపు రాజధాని అయిన మాస్కోకు 5 వేల 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిరెన్స్క్ ప్రాంతం. ఆ ప్రాంతంలోని ప్రజల కోసం వేసిన పార్టిశాన్ అలిమోవ్ స్ట్రీట్ రోడ్డు వేశారు. కొత్తగా వేసిన ఆ రోడ్డుపై ప్రజలు వెళ్తున్నారు. మంచు కురవటంతో వెళ్లటానికి ఇబ్బందిగా మారటంతో అతి జాగ్రత్తగా వెళుతున్నారు. అలా నడుస్తూ వెళ్తున్నవారు కాస్తా షాక్ అయి ఆగిపోయారు. రోడ్డుపై కనిపించిన వాటిని ఆశ్చర్యంతో..భయంతో చూస్తుండిపోయారు.

ఈ రోడ్డుపై మనుషుల ఎముకలు, పుర్రె కనిపించాయి. రోడ్డు కోసం వేసిన కంకర, ఇసుక వంటి వాటిలో మనుషుల ఎముకలను కూడా ఉండటమేంటి అని షాక్ అయ్యారు ప్రజలు. ఆ ఎముకల్ని చూసిన స్థానికులు భయపడిపోయారు. ఎవరినన్నా చంపేసి వారిని రోడ్డులో కలిపి వేసేసారా? అసలు ఏం జరిగిందోనని భయాందోళలనకు గురయ్యారు.ఆ రోడ్డుపై వెళ్లేవారందరిదీ అదే పరిస్థితి. ఒకరికి మొహాలు మరొకరు చూసుకున్నారు. ఇదేంటీ మనుషుల ఎముకలు..పుర్రెలు రోడ్డులో కనిపిస్తున్నాయి? అని చెప్పుకున్నారు. అనంతరం వాటిని వారి ఫోన్లతో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా పెట్టారో లేదో ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు కాస్తా రష్యా పోలీసుల దృష్టికి వెళ్లాయి.దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. ప్రాంతీయ మంత్రిత్వ శాఖ కూడా దర్యాప్తు ప్రారంభించింది.అలా రోడ్డులో మనిషి ఎముకలు..పుర్రెలు ఉండటంపై ఇప్పటివరకూ జరిపిన దర్యాప్తులో తేలిందేమంటే..ఆ ఎముకలు 100 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తులవని అంచనావేశారు అధికారులు. 1917-1920 మధ్య రష్యా సివిల్ వార్‌లో చనిపోయిన వ్యక్తివి కావచ్చని మెట్రో యూకే రిపోర్ట్ చేసింది. అవి మనిషి ఎముకలే అని క్లియర్‌గా తెలిసినా… అధికారులు మాత్రం నోరువిప్పట్లేదు. దానికి గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ తీసుకుని ప్రైవేట్ కాంట్రాక్టర్… రోడ్డు నిర్మిస్తున్నప్పుడు… ఎముకలు రోడ్డుపై పడినా గమనించకుండా… నిర్లక్ష్యంతో రోడ్డు వేసి ఉండొచ్చని తెలుస్తోంది.

Rassia Road with Human Bones,Skullప్రస్తుతం రోడ్డు నిర్మాణంలో కనిపించిన మనిషి పుర్రెను ఎప్పటిది? ఎవరిది అన్నదానిపై నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. అక్కడి ఎముకల్ని కూడా సేకరించి… ఫోరెన్సిక్ ల్యాబ్‌కి తరలించారని రష్యా న్యూస్ ఏజెన్సీ ఇంటర్‌ఫాక్స్ తెలిపింది.


1978లో సీతారామ లక్ష్మణ విగ్రహాలు చోరీ : 40 ఏళ్లకు భారత్ కు అప్పగించిన బ్రిటన్కాగా..కొన్ని నెలల కిందట… జపాన్ లోని నగరం ఒసాకాలో.. 1500 మనుషుల ఎముకలు కనిపించాయి. ఉమెలా టోంబ్ (Umela Tomb) ప్రాంతంలో తవ్వినప్పుడు కనిపించిన అవి… 160 ఏళ్ల నాటివిగా గుర్తించారు పరిశోధకులు. పందులు, గుర్రాలు, పిల్లులకు సంబంధించిన 350 చిన్న సమాధులను గుర్తించారు. 1850, 1860 మధ్య నాటికి సంబంధించి మొత్తం 7 శ్మశానవాటికలు ఉండగా… ఉమెలా టోంబ్ వాటిలో ఒకటి.

Related Tags :

Related Posts :