లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కట్టుకున్నోడికి విడాకులిచ్చి కొడుకును పెళ్లి చేసుకున్న తల్లి..!కొడుకుబిడ్డకు తలైన భార్యను ఆదరించిన భర్త!: ఎవరికెవరు ఏమవుతార్రా ద్యావుడా..!!

Published

on

Russian Strange family..! : కట్టుకున్న భర్తకు విడాకులిచ్చి కొడుకును పెళ్లి చేసుకున్న తల్లి..!షాక్ అయిన ఆ భర్తకు పాపం గుండె ఆగినంత పనైంది. అక్కడితో ఆగలేదీ విచిత్ర కుటుంబంలోని సంబంధాలు..కొడుకును పెళ్లి చేసుకున్న ఆ తల్లికి కొడుకు ద్వారా ఓ బిడ్డ కూడా పుట్టింది. తన తల్లిని కాదు కాదు..తండ్రికి మాజీ భార్య..ప్రస్తుతం తనకు భార్యఅయిన ఆమెను తీసుకుని తండ్రి దగ్గరకొచ్చాడా కొడుకు..!! జరిగింది చెప్పి..గతంతో ఈమె మీ భార్య..ఇప్పుడు నా భార్య..అని పరిచయం చేశాడు. దీంతో పాపం ఆ భర్తకు గుండె ఆగినంత పనైంది. జరగకూడనిది జరిగిపోయింది. ఇంకేం చేయాలేమని అనుకున్న ఆ నిస్సహాయ భర్త కొడుకునీ..భార్యనీ (వీళ్లు ఎవరికి ఎవరు ఏమవుతారో..!!)ఇంట్లోకి ఆహ్వానించాడు. ఈ వింత విచిత్ర సంబంధాలు కలిగిన ఈ గందరగోళం కటుంబం కథకాని కథ రష్యాలో జరిగింది..!!

     

రష్యాలోని క్రాస్నాదర్ క్రాయి ప్రాంతానికి చెందిన సోషల్ మీడియా స్టార్..ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సుర్‌గా లక్షలాదిమంది ఫాలోవర్స్ ఉన్న మెరీనా బల్మాషేవా అనే 35 ఏళ్ల మహిళ 10ఏళ్ల కిందట 45 ఏళ్ల అర్రేను పెళ్లి చేసుకుంది. అప్పటికే అర్రేకు వ్లాడిమిర్ అనే 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మెరీనా కూడా వ్లాడిమిర్ సవతి కొడుకైనా ఎంతో ప్రేమగా చూసుకొనేది. అన్నీ తానై పెంచింది. వారి కుటుంబం అంతా సంతోషంగా సాగిపోతోందనుకునే క్రమంలో కొన్ని నెలల కిందట అర్రేతో స్పర్థలు ఏర్పడటంతో మెరీనా విడిపోయింది. విడాకులు కూడా తీసుకుంది. అలా అర్రేను వదిలి బైటకొచ్చేసి ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది.

చాలామంది భార్యభర్తల్లాగే విబేధాలో విడిపోయినవారిలా అర్రే,మెరీనా ఉంటున్నారు. ఇక్కడికి వరకూ బాగానే ఉంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. మెరానీ ఇంట్లోంచి వెళ్లిపోయినప్పటినుంచి ఆమెమీద బెంగపెట్టుకన్నాడు 20ఏళ్ల పెంపుడుకొడుకు వ్లాడిమిర్. మెరీనాను వదిలి ఉండలేకపోయాడు. వ్లాడిమిర్‌కు 20 ఏళ్లు దాటాయి. మెరీనా తన తండ్రికి విడాకులిచ్చి వదిలేసి విడిగా జీవిస్తున్నా..వ్లాడిమిర్ మాత్రం ఆమెకు దూరంకాలేదు. మెరినా ఇంటికి వెళ్లి కలుస్తూండేవాడు. మెరినా కూడా వ్లాడిమిర్ అస్తమాను వస్తుండటంతో సంతోషంగా ఉండేది.

ఈక్రమంలో వారి మధ్య ఉన్నది ‘‘తల్లి-కొడుకుల బంధం’’ కాదని, దానికి మించినదని ఏదో ఉందని మెరీనా అనుకునేది. ఆ భావన వ్లాడిమిర్ కు కూడా కలిగింది. అలా ఇద్దరి భావనల్ని ఓ రోజు పంచుకున్నారు. ముందుగా మెరినా తన మనసులో మాటను వ్లాడిమిర్‌కు చెప్పింది. దీనికి అతను కూడా సంతోషంగా అంగీకరించాడు..!!

తమ ప్రేమను పెళ్లితో కొనసాగించారు. భార్యాభర్తల్లాగానే మసలేవారు. ఈ వార్త విని ఆమె మాజీ భర్తకు గుండె ఆగినంత పనైంది. తనతో కాపురం చేసి..ఇప్పుడు తన కొడుకుతో అలా ఉండటాన్ని భరించలేకపోయాడు. తన మాజీ భార్య తనకు కోడలిగా తిరిగి వస్తుందని తెలిసి చెప్పుకోలేని ఆవేదనకు గురయ్యాడు. కానీ..ఓ పక్క కొడుకు ఇష్టాన్ని కాదనలేక..మాజీ భార్యను కోడలిగా అంగీకరించలేక మానసికంగా క్షోభకు గురయ్యాడు.

ఓ రోజున తన భార్యను (తండ్రికి మాజీ భార్య) మెరీనాను..తీసుకుని తండ్రి దగ్గరకొచ్చాడు. అయిష్టంతోనే వారి నిర్ణయాన్ని పెద్ద మనస్సుతో స్వాగతించాడు అర్రే. దీంతో ఇద్దరు చట్టబద్దంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొత్త జంట ఏమాత్రం ఆలస్యం చేయకుండా..వ్లాడిమిర్ ఒక్క నెలలోనే పెంపుడు తల్లి..ప్రస్తుతం తన భార్య అయిన మెరీనాను గర్భవతిని చేశాడు. ఇప్పుడు ఆమెకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సుర్‌గా 5,60,000 మంది ఫాలోవర్లు ఉన్నా మెరినా బల్మాషెవా..!!

మరి ఈ మాజీ భార్యభర్తలు ఇప్పుడు ఎవరికెవరు ఏమవుతారు? మాజీ భార్యను కోడలవుతుందా? కొడుకు పుట్టిన మగబిడ్డ అర్రేకు మనుమడు అవుతాడా? మాజీ భార్యకు పుట్టాడు కాబట్టి కొడుకవుతాడా? ఎవరికి ఎవరు ఏమవుతారో ఏంటో అంతా గందరగోళంగా ఉంది కదూ..ఈ విచిత్రం కటుంబంలోని వావివరసలు..!!!

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *