‘RX 100’ Fame Ajay Bhupathi Set To Join Hands With Naga Chaitanya

చైతూ సినిమాలో ‘RX 100’ హీరో!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘RX 100’ దర్శకుడు అజయ్ భూపతి ఫస్ట్ సినిమాతోనే పెద్ద హిట్ సాధించి అందరిని ఆకర్షించారు.

‘RX 100’ దర్శకుడు అజయ్ భూపతి ఫస్ట్ సినిమాతోనే పెద్ద హిట్ సాధించి అందరిని ఆకర్షించారు. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా తరవాత అక్కినేని నాగచైతన్యతో కొత్త సినిమాను ఫైనల్ చేశారని తెలిపారు. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ అధికారికగా నటించనున్నారని సమాచారం. ‘మహాసముద్రం’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారని టాక్. ఇందులో ‘మహా’ హీరోయిన్ పాత్ర పేరని అంటున్నారు. 

ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. ‘RX 100’ హీరో కార్తికేయ రెడ్డి కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అజయ్ భూపతి కథను కార్తికేయకు వినిపించారట.

కానీ, కార్తికేయ తన నిర్ణయాన్ని వెల్లడించారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. అంతేకాదు ‘గుణ 369’ అనే సినిమాలోనూ కార్తికేయ హీరోగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలైంది. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Also Read : కడుపా..కండోమ్స్ మడుగా!: 80 మింగేశాడు

Related Tags :

Related Posts :