లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

మోడీ ప్రకటన:శబరిమల అంశంలో బీజేపీ ప్రజల పక్షమే

Published

on

Modi on Sabarimala

కేరళ: శబరిమల అంశంలో కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటుగా ఉందని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కేరళలోని కొల్లాంలో జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ..ఎల్డీఎఫ్ ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంబిస్తోందని, సాంప్రదాయాలను కమ్యూనిస్టులు గౌరవించరని ఆరోపించారు.
కేరళలోని శబరిమల  అయ్యప్ప స్వామిని దర్శించుకోటానికి అన్ని వయస్సుల మహిళలువెళ్లవచ్చని సుప్రీంకోర్టు తీర్పుఇచ్చిన తర్వాత శబరిమలలో పలుసార్లు ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. కేరళలో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించే అంశంలో బీజేపీ ప్రజల పక్షమే ఉంటుందని  మోడీ చెప్పారు. కాంగ్రెస్ వామపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని అన్నారు. 
కేరళలో ఎల్డీఎఫ్,యూడీఎఫ్ వి ఒకే రకమైన విధానాలని ఆయన ఆరోపించారు. కేరళ సాంప్రదాయాన్ని ఎల్డీఎఫ్,యూడీఎఫ్ నాశనం చేస్తున్నాయని అన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు ఆడుకుంటున్నాయని మోడీ విమర్శించారు. ఈబీసీ  రిజర్వేషన్ బిల్లును యూడీఎఫ్ కూటమి వ్యతిరేకించిందని మోడీ తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *