సొంతగూటికి పైలెట్! కీలక సమయంలో .రాహుల్, ప్రియాంకతో సమావేశమైన సచిన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. గతనెలలో సచిన్ పైలట్‌తో పాటు 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం ఆరంభమై దాదాపు నెల దాటుతోంది.అయితే ఈ సమస్య కొలిక్కి వచ్చేలా ఉంది. తాజాగా సోమవారం(ఆగస్ట్-10,2020) రాహుల్, ప్రియాంక వాద్రలతో గంటన్నర పాటు సచిన్ పైలట్ సమావేశమైనట్లు సమాచారం.

ఈ విషయాన్ని పార్టీలోని ఇద్దరు సీనియర్ లీడర్లు తెలిపారు. ఆగస్టు 14 నుండి జరిగే కీలకమైన రాజస్థాన్ అసెంబ్లీ సమావేశానికి ముందు, సచిన్ పైలట్… రాహుల్ గాంధీని,ప్రియాంక గాంధీని కలవడం కీలక పరిణామం.పలు అంశాలపై రాహుల్,ప్రియాంకతో పైలట్ చర్చించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పార్టీలోని ఇద్దరు సీనియర్ లీడర్లు తెలిపారు. సచిన్ పైలట్ తో సమావేశాన్ని హైకమాండే స్వయంగా ప్రారంభించినట్లు సమాచారం.

పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరూ తమ అసంతృప్తి పార్టీపైన కాదని, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ పైనేనని ఇప్పటికీ చెప్తున్నారు. సచిన్ పైలట్ పార్టీ నాయకత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్పారు. రాజస్థాన్‌లో ప్రభుత్వ సంక్షోభం పరిష్కరమవుతుందని పార్టీ హామీ ఇచ్చిందని బాహాటంగా అంటున్నారు.


Related Posts