Sachin Tendulkar Consoles SRH Star Rashid Khan After His Mother Passes Away

స్పిన్నర్ రషీద్‌ను ఓదార్చిన సచిన్ టెండుల్కర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్, ఐపీఎల్‌తో భారత్‌లో అభిమానులను దక్కించుకున్న రషీద్ ఖాన్ తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు. కొంతకాలగా సుదీర్ఘ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న అతడి త‌ల్లి చనిపోయారు. ఈ శాడ్ న్యూస్ తన అభిమానులతో పంచుకుంటూ ట్విటర్‌లో రషీద్ ఖాన్‌ భావోద్వేగ పోస్ట్‌ పెట్టాడు. 

‘అమ్మా.. నువ్వే నా ధ్యాస‌, శ్వాస‌. నీవు లేకుండా నేను లేను. నువ్వు ఇక నాతో ఉండవనే విషయం వేధిస్తోంది. నీ దూరంతో చాలా కోల్పోతున్నాన‌మ్మ‌. నీ ఆత్మకు శాంతికలగాలి’‌ అంటూ రషీద్ త‌న బాధ‌ను వ్య‌క్త‌ప‌రిచాడు. రషీద్‌ తల్లి మరణవార్త తెలుసుకున్న పలువురు క్రికెటర్లు… సామాజిక మాధ్య‌మాల ద్వారా అత‌డిని ఓదారుస్తున్నారు.

ఈ క్రమంలోనే భారత మాజీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ కూడా ట్విట్టర్ ద్వారా రషీద్ ఖాన్‌ను ఓదార్చాడు. నిన్ను నిస్వార్థంగా ప్రేమిస్తున్న వ్యక్తిని కోల్పోయిన బాధను అర్థం చేసుకోవడం అసాధ్యం. అయితే మీ తల్లి ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది రషీద్. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నా సంతాపం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అంటూ ట్వీట్ చేశారు. 

రషీద్ ఖాన్ భారతదేశంలో జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడతాడు. కరోనా వైరస్ సంక్రమణ వ్యాప్తి కారణంగా, ఈసారి టోర్నమెంట్ ఇంకా నిర్వహించబడలేదు. ఇది సెప్టెంబర్-అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

Read: ప్రపంచ కప్ భారత్ అమ్మేసుకుందా : విచారణకు లంక ప్రభుత్వం ఆదేశం

Related Posts