లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

సచిన్ టెండూల్కర్ కు దారి చూపెట్టిన ఆటో డ్రైవర్

Published

on

Sachin Tendulkar loses his way : ప్రత్యర్థి బాల్ వేస్తే..దానిని ఎలా బౌండరీ, సిక్స్ గా మలచాలనే ఆలోచన ఉంటుంది అతనికి. బ్యాట్ తో విన్యాసాలు చేసి చూపించి ఇతర జట్లకు వణుకు పుట్టించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఓ లెజెండ్. అతనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. కానీ…ఈయన దారి తప్పాడు. ఏదో అనుకోకండి. ఒక ప్రాంతానికి ఎలా వెళ్లాలో తెలియలేదు. దారి తెలియని పరిస్థితుల్లో సచిన్ కు ఓ ఆటో డ్రైవర్ సహాయం చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఓ పని మీద సచిన్..ముంబాయి శివారు ప్రాంతానికి వెళ్లారు. హైవే మీదుగా ప్రయాణించాల్సి ఉంది. కానీ..అంతా గందరగోళంగా ఉంది, ఎలా వెళ్లాలో తెలియలేదని సచిన్ ఆ వీడియోలో వెల్లడించారు. ఈ సమయంలో..తనకు ఓ ఆటో డ్రైవర్ సహాయం చేశాడని, తనను ఫాలో కావాలని చెప్పాడన్నారు. తన ఆటోను హైవే దిశగా తీసుకెళ్లి దారి చూపించాడు. ఆ ఆటోను ఫాలో అయిన సచిన్..హైవేకు చేరుకోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.క్రికేట్ గాడ్ తన ఎదురుగా ఉండడంతో ఆ ఆటోవాలా…ఫుల్ ఖుష్ అయ్యాడు. ఒక ఫొటో తీసుకుంటానని చెప్పి..ఆటోను ఆపి..సెల్ఫీ తీసుకున్నాడు. దారి చూపినందుకు సచిన్ అతని థాంక్స్ చెప్పారు. అయితే..ఈ వీడియో జనవరిలో జరిగిందన్నారు.

మ్యాచ్ మధ్యలో వార్నర్ బుట్టబొమ్మ డ్యాన్స్

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *