సంజయ్ దత్ ‘సడక్ 2’ ట్రైలర్ చూశారా!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సంజ‌య్‌ద‌త్‌, పూజా భ‌ట్‌, ఆదిత్య‌రాయ్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ ప్ర‌దాన పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం ‘స‌డ‌క్ 2’. 1991లో సంజ‌య్‌ద‌త్‌, పూజా భ‌ట్ జంట‌గా మ‌హేశ్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సడక్’కు ఇది సీక్వెల్‌గా ‘స‌డ‌క్ 2’ రూపొందింది. ఈ సీక్వెల్‌కు కూడా మ‌హేశ్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బుధ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర‌ యూనిట్ విడుద‌ల చేసింది.

ఓ టాక్సీ డ్రైవ‌ర్‌, దొంగ బాబా వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ఓ అమ్మాయితో పాటు ఆమె ప్రియుణ్ణి ఎలా కాపాడాడు? అనే కాన్సెప్ట్‌తో ‘స‌డ‌క్ 2’ చిత్రం రూపొందినట్లు ట్రైల‌ర్ ద్వారా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

అలియా, ఆదిత్యల కెమిస్ట్రీ, సంజయ్ దత్ నటన, విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ఈ నెల 28న డిజిట‌ల్ మాధ్య‌మం DisneyPlus Hotstar VIP ద్వారా ‘సడక్ 2’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related Tags :

Related Posts :