ప్రపంచంలోనే మోస్ట్ డిస్‌లైక్డ్ వీడియో.. ‘‘సడక్ 2’’..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సంజయ్ దత్, పూజా భట్, ఆదిత్యరాయ్ కపూర్, ఆలియా భట్ ప్రదాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సడక్ 2’. 1991లో సంజయ్ దత్, పూజా భట్ జంటగా మహేశ్ భట్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సడక్’కు ఇది సీక్వెల్‌గా ‘సడక్ 2’ రూపొందింది. ఈ సీక్వెల్‌కు కూడా మహేశ్ భట్ దర్శకత్వం వహించారు. విడుదలకు మందే ఈ సినిమా అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.
‘స‌డ‌క్ 2’ ట్రైల‌ర్‌ ప్ర‌పంచంలోనే రెండో Most Disliked వీడియోగా రికార్డుల‌కెక్కింది. Sadak 2 ఈ ట్రైల‌ర్‌ను ఇప్ప‌టివ‌ర‌కు 61 మిలియన్ల మంది వీక్షించ‌గా, ‘‘జ‌స్టిస్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్’’ అంటూ కుండ‌పోత‌గా కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 11.65 మిలియ‌న్ల మంది ఈ వీడియోకు డిస్‌లైక్ కొట్ట‌ారు. దీంతో ప్ర‌పంచ రికార్డు కొట్టేసింది. అప్ప‌టివ‌ర‌కు అత్య‌ధికంగా డిస్‌లైకులు సాధించిన వీడియోగా రెండో స్థానంలో ఉన్న జ‌స్టిన్ బీబ‌ర్ ‘బేబీ’(11.63 million dislikes) పాట మూడో స్థానానికి దిగ‌జారింది. బీబ‌ర్ రికార్డు బ‌ద్దలు కొట్ట‌డానికి దాదాపు 10 సంవ‌త్స‌రాలు ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. 18 మిలియ‌న్ల డిస్‌లైకుల‌తో ‘‘యూట్యూబ్ రివైండ్ 2018: ఎవ్రీ వ‌న్ కంట్రోల్స్ రివైండ్’’ వీడియో అగ్ర స్థానంలో ఉంది. ఆగ‌స్టు 12 స‌డ‌క్ 2 సినిమా ట్రైల‌ర్ విడుద‌ల అవ‌గా ఇప్ప‌టికీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే నిలుస్తుండ‌టం విశేషం. Sadak 2

బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగానే మహేష్ భట్, కరణ్ జోహార్, అలియా భట్, రియా చక్రవర్తి వంటివారు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను తొక్కేశారంటూ.. నెటిజన్లు ‘సడక్ 2’ ట్రైలర్‌కు డిస్ లైక్స్ కొడదామని కంకణం కట్టుకుని ఎట్టకేలకు అన్నంత పని చేశారు. కేవలం డిస్ లైక్ కొట్టడానికే ట్రైలర్ ఓపెన్ చేసినవారూ ఉన్నారంటే.. వారి ఆవేశం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నెల 28న డిజిట‌ల్ మాధ్య‌మం DisneyPlus Hotstar VIP ద్వారా ‘సడక్ 2’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.Related Tags :

Related Posts :