sadineni yamini resigns tdp

చంద్రబాబుకి మరో షాక్ : టీడీపీకి సాధినేని యామిని రాజీనామా.. బీజేపీలో చేరతారా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీ టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు టీడీపీని వీడుతున్నారు. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని

ఏపీ టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు టీడీపీని వీడుతున్నారు. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని పార్టీకి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. గురువారం(నవంబర్ 7,2019) స్వయంగా రాజీనామా లేఖ రాసి టీడీపీ చీఫ్ చంద్రబాబుకి పంపారు. వ్యక్తిగత కారణాలతోపాటు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు యామిని లేఖలో తెలిపారు. ప్రస్తుతానికి భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఏమీ అనుకోలేదని, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని లేఖలో వెల్లడించారు.

కాగా, సాధినేని యామిని శర్మ త్వరలో బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడిన తర్వాతే టీడీపీకి ఆమె రాజీనామా చేశారని తెలుస్తోంది. నవంబర్ 10న బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి. నడ్డా సమక్షంలో యామిని కమలం గూటికి చేరతారని రాజకీయవర్గాల్లో టాక్. 

టీడీపీ తరపున తన వాయిస్‌ను బలంగా వినిపించారు సాధినేని యామిని. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. టీడీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ఎన్నికలకు ముందు వైసీపీ, బీజేపీని విమర్శించడంలో టీడీపీ కీలక నేతలతో పోటీపడ్డారు. ఎన్నికల్లో గుంటూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు యామిని. తన సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆ సీటును చంద్రబాబు మరొకరికి కేటాయించడంతో ఆమె నిరాశ చెందారు. ఇక ఎన్నికల తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో… యామిని టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నారట. అప్పట్లో చంద్రబాబు రంగంలోకి దిగి బుజ్జగించడంతో… యామిని కాస్త మెత్తబడ్డారట. కానీ, మళ్లీ ఆమె బీజేపీలోకి వెళ్లాలని డిసైడయ్యారట. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్టుతోపాటు.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కన్‌ఫర్మ్ చేయడంతో బీజేపీలో చేరేందుకు యామిని శర్మ సిద్దమైనట్లు రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఈ తరుణంలో పలువురు నేతలు పొలిటికల్ ఫ్యూచర్ కోసం బయటపడ్డారు. తాను కూడా ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిదని భావించిన యామిని.. బీజేపీ నేతలను సంప్రదించినట్లు చెబుతున్నారు. మొత్తంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వలసలు జోరందుకున్నాయి. ఎప్పుడు ఏ నాయకుడు జంప్ అవుతాడో టీడీపీ నేతలకే అర్థం కావడం లేదు. 

READ  నరేంద్ర మోడీ కాదు సరెండర్ మోడీ

Related Posts