లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

భార్యను, కొడుకును పొలంలోనే వదిలేసిన భర్త, స్పందించిన పోలీసులు

Published

on

Sadistic husband : వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కట్టుకున్న భార్య, కొడుకును ఓ భర్త బయటకు గెంటేశాడు. భార్యబిడ్డలను పొలంలోనే వదిలేసి వెళ్లిపోయాడు. అదనపుకట్నం తేవాలని ఇలా చేశాడా ఆ భర్త. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు స్పందించారు. భర్త ఓంకార్‌పై కేసు నమోదు చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే..

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌కి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఓంకార్‌కు అదే గ్రామానికి చెందిన దీపతో 2013లో వివాహం జరిగింది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం దీపను వేధిస్తున్నాడు. వీరికి ఓ బిడ్డ కలిగాక… తనకు పుట్టలేదంటూ ఆమెను మానసికంగా వేధించాడు. దీంతో భర్త పెడుతున్న ఇబ్బందులను ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు పెద్దమనుషులకు చెప్పింది.

దీంతో మరింత కక్ష పెంచుకున్న ఓంకార్‌… సొంతూరికి వెళ్దామంటూ భార్యబిడ్డలతో పాటు పెళ్లి సందర్భంగా అత్తామామలు పెట్టిన సామాన్లతో చెన్నై నుంచి కమలాపూర్‌కి తీసుకువచ్చాడు. ఇంటికి తీసుకెళ్లకుండా.. ఊరి బయట పొలంలో వారిని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ దీప వేడుకుంటోంది.