Home » సురక్షితమైన వ్యాక్సినే.. దేశ ప్రజలకు పంపిణీ : మోడీ
Published
3 months agoon
By
sreehariSafest Covid-19 Vaccine will be delivered to people : సురక్షితమైన కరోనా టీకా దేశ ప్రజలకు పంపిణీ చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
అన్ని రాష్ట్రాల సహకారంతోనే వ్యాక్సిన్ పంపిణీపై కార్యాచరణ ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ విషయంలో భారతదేశానికి ఉన్న అనుభవం ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలకు కూడా లేదని మోడీ స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ స్టోరేజీలకు సంబంధించి కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలను రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి నిర్వహణపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన నరేంద్ర మోడీ కీలక భేటీ అయ్యారు. కరోనా నియంత్రణలో ఇతర దేశాల కంటే మనం మెరుగ్గా ఉన్నామన్నారు. తీవ్ర సంక్షోభం నుంచి బయటపడుతున్నామని చెప్పారు.
కరోనాపై నిర్లక్ష్యం వద్దని చెప్పారు. కరోనా పాజిటివ్ రేటు 5 శాతం లోపే ఉండాలని తెలిపారు. ఆర్ టీ పీసీఆర్ టెస్టులను తప్పనిసరిగా పెంచాలన్నారు. వ్యాక్సిన్ వచ్చాక అందరికి అందించాలని చెప్పారు.
వ్యాక్సిన్ పంపిణీపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ప్రధాని రాష్ట్రాలకు సూచించారు. కొత్తగా 160 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే వ్యాక్సిన్ ప్రాథమికంగా ఎవరికి ఇవ్వాలన్నది రాష్ట్రాలతో చర్చించాకే నిర్ణయిస్తామని మోడీ తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ మనకు అత్యవసరమేనన్నారు. దాంతో పాటు స్టేపీ కూడా చాలా ముఖ్యమని మోడీ పేర్కొన్నారు. శాస్త్రవేత్తల సూచన మేరకే భారత్ కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందిస్తుందని మోడీ ముఖ్యమంత్రులతో కీలక భేటీలో తెలిపారు.
వ్యాక్సిన్ పంపిణీపై అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రాథమికంగా టీకా ఎవరికి ఇవ్వాలన్నది రాష్ట్రాలతో కలిసే నిర్ణయిస్తామని మోడీ స్పష్టం చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిబంధనల ప్రకారం నడచుకుంటే బాగుంటుందని మోడీ హితవు పలికారు. అందరం కలిసే నిర్ణయం తీసుకుందామన్నారు.
కరోనా వేళ మరో ప్రాణాంతక వైరస్ విజృంభణ, ఆ 6 దేశాలకు అలర్ట్
కరోనావైరస్ ల్యాబ్ల నుంచి లీక్ అవలేదు: WHO
కరోనా “పుట్టుక”పై WHO కీలక ప్రకటన
నోబెల్ శాంతి బహుమతి రేసులో బాల పర్యావరణవేత్త గ్రెటా థన్ బెర్గ్
ప్రపంచంలోనే తొలి కరోనా కేసు నమోదైన ఆసుపత్రికి WHO బృందం
గబ్బిలమా? ల్యాబా? కరోనా వైరస్ పుట్టుక మిస్టరీ వీడనుందా