లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

కాషాయ నేతలు పెళ్లి చేసుకోరు.. కానీ రేప్ లు చేస్తారు

Published

on

Saffron-clad netas don't marry but rape women: JMM chief Hemant Soren's sharp attack on BJP

బీజేపీపై,యూపీ సీఎం యోగిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జార్ఖండ్ మాజీ సీఎం,జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్. కాషాయదస్తులు ధరించే నాయకులు పెళ్లిల్లు చేసుకోరు కానీ అత్యాచారాలు చేస్తారని సోరెన్ అన్నారు. ఉన్నావో,హైదరాబాద్ హత్యాచార ఘటనలను సోరెన్ ప్రస్తావిస్తూ…దేశంలో గడిచిన కొన్ని రోజుల్లో చాలామంది మహిళలపై అత్యాచారం చేసి తగులబెట్టారు. యూపీ సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించి ఇక్కడ తిరిగాడని నేను విన్నాను. కాషాయదుస్తులు ధరించి బీజేపీ వర్కర్లు పెళ్లి చేసుకోరు కానీ రేప్ లు మాత్రం చేస్తారని సోరెన్ అన్నారు.

మహిళలకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమయిందని సోరెన్ ఆరోపించారు. నిందితులకు బీజేపీ రక్షణ కల్పిస్తోందన్నారు. మంగళవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్ లో ని డియోగర్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో యోగి పాల్గొన్న విషయం తెలిసిందే. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,జేఎంఎం,ఆర్జేడీ కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కూటిమి సీఎం అభ్యర్థిగా హేమంత్ సోరెన్ ఉన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *