కారు డ్రైవర్‌కి కరోనా.. క్వారంటైన్‌లోకి సల్మాన్ ఖాన్.. బిగ్‌బాస్ పరిస్థితేంటీ?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Salman Khan:బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన కారు డ్రైవర్‌కు వ్యక్తిగత సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రావడంతో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అతని వ్యక్తిగత డ్రైవర్ అశోక్‌కు కరోనా పాజిటివ్ అని తేలగా.. సల్మాన్ ఖాన్ తనకు తానుగా 14 రోజులు ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు, ఖాన్ కుటుంబం మొత్తం 14 రోజులు క్వారంటైన్లో ఉండబోతోంది. నివేదికల ప్రకారం సల్మాన్ ఖాన్ సిబ్బందిని ముంబైలోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే, సల్మాన్ ఖాన్ మరియు అతని కుటుంబం నుంచి ఇప్పటివరకు దీనిపై ఎటువంటి ప్రకటన రాలేదు.


ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యామిలీతో ఎన్టీఆర్..


సల్మాన్ ఖాన్ తన సిబ్బందికి ఉత్తమమైన చికిత్స లభించేలా చూసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే సల్మాన్ ఖాన్ క్వారంటైన్‌లోకి వెళ్లడంతో ఈ వారం ‘బిగ్ బాస్ 14’ ‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్ షూట్ చేయగలరా లేదా అనే విషయంపై అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌కి అందుబాటులోకి రాకపోతే.. షారుక్‌ఖాన్ చెయ్యవచ్చు అని కూడా అంటున్నారు.ఇటీవల లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్‌ ప్రారంభం అవ్వగా.. సల్మాన్‌ ‘రాధే’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌ సరసన దిశా పటానీ నటిస్తుంది.

Related Tags :

Related Posts :