లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘Sam Jam’ కోసం సమంత ‘ఆహా’ అంత మొత్తంలో!

Published

on

Sam Jam – Samantha Remuneration: ఇటీవలే బిజినెస్ లోకి ఎంటరైన అక్కినేని వారి కోడలు సమంత తాజాగా డిజిటల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం ‘‘సామ్ జామ్’’ పేరిట ఓ స్పెషల్ టాక్ షోను హోస్ట్ చేస్తోంది సామ్. ఈ షోలో ఆమె పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయనుంది.


డిజిటల్‌ మాధ్యమంలో ఈ స్పెషల్‌ షోను హోస్ట్‌ చేయడానికి సమంత భారీ రెమ్యునరేషన్‌నే అందుకుంటుందని సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం మేరకు సమంత ఓ ఎపిసోడ్‌‌కు రూ.పదిహేను లక్షలు ఛార్జ్‌ చేస్తుందట. కాగా ఇప్పటి వరకు 12 ఎపిసోడ్స్‌ ప్లాన్‌ చేశారట. ఈ లెక్కన మొత్తంగా చూస్తే ఈ షో ద్వారా సమంతకు రూ.1.8 కోట్లు రెమ్యునరేషన్‌ దక్కుతుంది.


ఒకవేళ ఇంత పెద్ద రెమ్యునరేషన్‌లో సినిమా చేయాలంటే మాత్రం దాదాపు రెండు నెలల కాల్షీట్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ టాక్‌ షోకు కేవలం పన్నెండు రోజుల సమయం కేటాయిస్తే చాలు. ఆ లెక్కన సమంత ఈ ‘‘సామ్ జామ్’’ షోను నిర్వహించడానికి భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లే లెక్క. టాలీవుడ్ కథానాయికల్లో ఇంత భారీ స్థాయిలో మరెవరూ పారితోషికం తీసుకోలేదనే చెప్పాలి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *