లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

అంతరిక్షంలోకి సమోసాను పంపిన భారతీయ రెస్టారెంట్.. ఫ్రాన్స్‌లో క్రాష్ ల్యాండ్!

Published

on

Samosa Bound for Space Crash-Landed in France : భారతీయ వంటకాలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.. ప్రపంచదేశాలు భారతీయ వంటకాలకు ఫిదా కావాల్సిందే. విదేశీయులు సైతం భారతీయ వంటకాలను ఇష్టంగా ఆరగిస్తుంటారు. అలాంటి గొప్ప రుచులు కలిగిన భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇటీవల యూకేలోని ఒక భారతీయ రెస్టారెంట్ ఒక సమోసాను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. కానీ, అది వెంటనే ఫ్రాన్స్ లో క్రాష్ ల్యాండ్ అయింది. సమోసా అంతరిక్షంలోకి ప్రవేశించడం ఇదేం మొదటిసారి కాదు. 2007లో అంతరిక్ష కేంద్రంలో భారత అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా సమోసాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు.
బాత్ నగరంలోని అత్యుత్తమ ర్యాంక్ టేకౌట్ జాయింట్లలో ఒకటైన సమోసాను తీసుకున్నారు. మూడు ప్రయత్నాల్లో ఈ ఫీట్‌ను సాధించారు. ఇదంతా డిసెంబర్ 2020లో ప్రారంభమైంది. యజమాని నీరాజ్ గాధర్ సమోసాను అంతరిక్షంలోకి పంపాలని అనుకున్నాడు. ఒక సమోసాను అంతరిక్షంలోకి పంపుతాను అని జోక్‌ చేశారు. ఆయన అన్నట్టుగానే అంతరిక్షంలోకి సమోసాను పంపారు. చాయ్ వల్లా సమోసాలు ప్రత్యేకమైనవిగా పేర్కొన్నారు. ప్రతి రెస్టారెంటు మెనూలో ఎక్కువగా అమ్ముడయ్యే ఆహార పదార్థాల్లో ఒకటిగా గాధర్ తెలిపారు.

అంతరిక్ష ప్రయోగం కోసం.. ఒక ఆలూ సమోసాను ఉపయోగించారు. అంతరిక్షంలో ఎక్కువసేపు ఉండేందుకు సాధారణం కంటే ఎక్కువ సేపు వేయించారు. ఈ సమోసాను, ర్యాప్ రెండింటిని ఒక పెట్టెలో ఉంచాడు. హీలియం బెలూన్ తో పాటు గోప్రో కెమెరా, జీపీఎస్ ట్రాకర్ కూడా యాడ్ చేశాడు. పూర్తిగా రెడీ చేయకుండానే హీలియం బెలూన్ విడిచిపెట్టేశాడు. మొదటి ప్రయత్నం క్రాఫ్ట్ అయింది. ఇక రెండో ప్రయత్నం హీలియం లేక విఫలమైంది. మూడో ప్రయత్నంలో ఈ సమోసా ప్యాకేజీ విమానంతో పాటుగా ప్రయాణించింది. సమోసా ప్రతి కదలికను రికార్డు చేసేలా కెమెరా కూడా అమర్చారు.
ఆకాశంలోకి ఎగిరిన సమోసాను ట్రాక్ చేసేందుకు జీపీఎస్ పనిచేయలేదు. అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు సమోసా ట్రాకింగ్ విఫలమైంది. కానీ, మరుసటి రోజున సమోసా జాడ దొరికింది. బయల్దేరిన ప్రదేశానికి 300 మైళ్ల దూరంలో ఫ్రాన్స్ లోని కైక్స్ లో ఒక అడవిలో బెలూన్ దిగినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి వీడియోను కూడా యూట్యూబ్ లో పోస్టు చేయగా.. మూడు రోజుల్లోనే 58వేల వ్యూస్ సంపాదించింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *