భారీ బ్యాటరీతో శాంసంగ్ కొత్త Galaxy M51 స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ధర ఎంతో తెలుసా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది.. శాంసంగ్ గెలాక్సీ M51 స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ M51ను లేటెస్ట్ గెలాక్సీ M-సిరీస్ ఫోన్‌గా జర్మనీలో విడుదల చేసింది.

ఆ తర్వాత వెంటనే గెలాక్సీ M51 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ హోల్-పంచ్ డిస్‌ప్లేతో వస్తుంది. క్వాడ్ రియర్ కెమెరాలతో అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ M51 భారీ 7,000mAh బ్యాటరీని అందిస్తోంది. అమెజాన్‌ వెబ్ సైట్లో‌ లిస్టింగ్‌ ఉంచింది. శాంసంగ్ గెలాక్సీ M51 లాంచ్‌ చేస్తున్నామని కంపెనీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ M51 సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) భారతదేశంలో లాంచ్ అవుతోంది.

ధర ఎంతంటే? :
భారతదేశ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M51 స్మార్ట్‌ఫోన్ ధరను వెల్లడించనుంది. జర్మనీ మార్కెట్లలో ధరలకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. బ్లాక్ వైట్ కలర్ ఆప్షన్లలో రానుంది. వచ్చే ఏకైక, 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ EUR 360 (సుమారు రూ. 31,600) వద్ద ప్రారంభమైంది. గెలాక్సీ M51 స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో రూ. 25 వేల నుంచి రూ. 30వేల వరకు ఉంటుందని అంచనా.

M51 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ M51 ఆండ్రాయిడ్ 10లో One UIతో రన్ అవుతుంది. హోల్-పంచ్ డిజైన్‌తో 6.7-అంగుళాల Full-HD+ సూపర్ AMOLED ప్లస్ ఇన్ఫినిటీ-O డిస్‌ప్లేతో వస్తోంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ SoC పవర్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్‌తో పాటు 6GB RAMతో వస్తోంది.

మైక్రో SD కార్డ్ ద్వారా 128GB ఆన్ బోర్డ్ స్టోరేజీ వరకు ఎక్స్ ఫ్యాండ్ చేసుకోవచ్చు. ఫోటోలు, వీడియోల కోసం, శాంసంగ్ గెలాక్సీ M51 క్వాడ్ రియర్ కెమెరా సెటప్ అందిస్తోంది. 64MP ప్రైమరీ సెన్సార్‌ను అందిస్తోంది. దీనితో పాటు f / 1.8 లెన్స్ ఉంటుంది. మీకు అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5-MP డెప్త్ సెన్సార్, మాక్రో లెన్స్‌తో 5MP సెన్సార్ కలిగిన 12MP సెకండరీ సెన్సార్ అందిస్తోంది.


ఈ ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ M51లో 4G LTE, Wi-Fi, బ్లూటూత్, USB Type-C పోర్ట్‌తో సహా పలు రకాల కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తోంది. ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని అందిస్తోంది.

READ  వీడియో గేమ్స్ ఆడడం మంచిదేనట: పిల్లల అక్షరాస్యత, కమ్యూనికేషన్, మానసిక ప్రశాంతతను పెంచుతాయి- సర్వే

Related Posts