లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

శాంసంగ్ గెలాక్సీ S10 సిరీస్ వచ్చేసింది : ఇండియాలో ఎంతంటే? 

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S10 సిరీస్ ను విడుదల చేసింది. ఇటీవల శాన్ ఫ్రాన్సిస్ కోలోని ఈవెంట్ లో శాంసంగ్ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లను ప్రదర్శించింది.

Published

on

Samsung Galaxy S10 series price in India 

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S10 సిరీస్ ను విడుదల చేసింది. ఇటీవల శాన్ ఫ్రాన్సిస్ కోలోని ఈవెంట్ లో శాంసంగ్ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లను ప్రదర్శించింది.

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ S10 సిరీస్ ను విడుదల చేసింది. ఇటీవల శాన్ ఫ్రాన్సిస్ కోలోని ఈవెంట్ లో శాంసంగ్ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్ల (S10, S10 ప్లస్, S10e)ను ప్రదర్శించింది. ఇప్పటికే ఈ కొత్త సిరీస్ ల కు సంబంధించి ప్రీ-బుకింగ్ ఆర్డర్లు మొదలయ్యాయి. ఫిబ్రవరి 21 నుంచే యూఎస్ లో అమ్మకాలు జోరుందుకున్నాయి. ఇండియాలో కూడా శాంసంగ్ S10 ఫ్రీ-బుకింగ్ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. శాంసంగ్ అందించే ఫ్లాగ్ షిప్ లైనప్ లో శాంసంగ్ s10 కొత్త సిరీస్ ప్రారంభ ధర రూ.55వేల 900గా ఉంది.

మార్చి 8 నుంచి శాంసంగ్ S10 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ రిటైల్, ఆన్ లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. ఇండియా మార్కెట్ లో శాంసంగ్ గెలాక్సీ s10 సింగిల్ వేరియంట్ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లభించనుంది. దీని ధర రూ. 55వేల 900. S10 సిరీస్ ప్రిస్మమ్ బ్లాక్, ప్రిస్మమ్ వైట్ కలర్లలో లభించనుంది. కెనరీ ఎల్లో కలర్ ఇతర కలర్ల ఆప్షన్ సిరీస్ లకు సంబంధించి శాంసంగ్ అధికారికంగా ప్రకటించలేదు. 
Read Also: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? : ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి

శాంసంగ్ గెలాక్సీ S10 రెండు వేరియంట్లలో లభించనుంది. 8జీబీ, 128జీబీ వేరియంట్ మోడల్ ధర రూ.66వేల 900 ఉండగా.. 8జీబీ, 512జీబీ మోడల్ ధర రూ. 84వేల 900 వరకు ఉంది. 128 జీబీ మోడల్ ఫోన్ ప్రిస్మమ్ బ్లాక్ లో, ప్రిస్మమ్ వైట్, ప్రిస్మమ్ బ్లూ కలర్లను అందిస్తోంది. 512జీబీ మోడల్ ఫోన్ ప్రిస్మమ్ వైట్ కలర్లో మాత్రమే ఉంది. టాప్ టైర్ గెలాక్సీ S10 ప్లస్ మోడల్ ప్రారంభ ధర రూ.73వేల 900 (8GB/128GB) వర్షన్ లో లభించనుంది. 8GB/512GB, 12GB/1టీబీ వేరియంట్స్ మోడళ్లు రూ.91వేల 900, రూ.1లక్ష 17వేల 900 వరకు ధర పలుకుతోంది. ఈ రెండు మోడల్ S10 గెలాక్సీ మోడల్ శాంసంగ్ ఫోన్లు Ceramic వైట్ అండ్ బ్లాక్ కలర్లతో ఆఫర్ చేస్తోంది. 

గెలాక్సీ S10 సిరీస్ మార్చి 5 వరకు ప్రీ ఆర్డర్లపై బుక్ చేసుకోవచ్చు. Samsung.com/in, Flipkart, Amazon India, Paytm, Tata CLiQ, రిటైల్ ఔటలెట్స్ నుంచి బుక్ చేసుకోవచ్చు. మార్చి 8 నుంచి ఈ ప్లాట్ ఫాంలపై అందుబాటులోకి రానున్నాయి. ప్రీ బుకింగ్ కస్టమర్లకు శాంసంగ్ కంపెనీ మార్చి 6 నుంచి డెలివరీలు చేయనుంది. 

గెలాక్సీ s10 ఆఫర్లు ఇవే
శాంసంగ్ గెలాక్సీ S10 సిరీస్ ప్రీ బుకింగ్ చేసుకున్న కస్లమర్లకు శాంసంగ్ కంపెనీ ఆఫర్లు ప్రకటించింది. గెలాక్సీ S10 సిరీస్ బుక్ చేసుకుంటే.. కొత్త గెలాక్సీ వాచ్ యాక్టివ్ (రూ. 9వేల 999) లేదా న్యూ గెలాక్సీ బడ్స్ (రూ.2వేల 999) ను సొంతం చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ కస్టమర్లకు రూ.15వేల వరకు అపగ్రేడ్ బోనస్ కూడా అందిస్తోంది. రూ.6వేల హెచ్ డీఎఫ్ సీ క్యాష్ బ్యాక్ లను అందిస్తోంది. గెలాక్సీ S10 డివైజ్ కొంటే అదిరిపోయే EMI (3 నెలల నుంచి 24నెలల వరకు) ఆఫర్లను శాంసంగ్ కంపెనీ అందిస్తోంది. 

గెలాక్సీ S10 స్పెషిఫికేషన్లు.. 
* Ininifty-O punch హోల్ డిసిప్లే 
గెలాక్సీ s10, s10 ప్లస్ అల్ట్రాసోనిక్ ఇన్ డిసిప్లే 
ఫింగర్ ఫ్రింట్ సెనార్స్
ట్రిపుల్ కెమెరాలు 
రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ 
స్మార్టర్ Wi-fi సపోర్ట్
ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్
Exynos 9820 చిప్ సెట్
S10 సిరీస్ బ్యాటరీలు (4,100mAh,3,400mAh and 3,100mAh)
QHD+ రెజుల్యుషన్ 
డైనమిక్ AMOLED ప్యానెల్స్
FHD+ రెజుల్యుషన్
Read Also: గుడ్ న్యూస్..ఆండ్రాయిడ్‌ యూజర్లకు కొత్త యాప్