లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

93 హత్యలు : US చరిత్రలోమోస్ట్ ప్రొఫెషనల్ సీరియల్ కిల్లర్ సామ్యూల్‌ లిటిల్‌ మృతి

Published

on

us serial killer samuel little deceased : యూఎస్ చరిత్రలోనే అత్యంత కరడుకట్టిన నేరస్థుడు..ప్రొఫెషనల్‌ సీరియల్‌ కిల్లర్‌గా పేరొందిన సామ్యూల్‌ లిటిల్‌ మృతి చెందాడు. 19 రాష్ట్రాల్లో సుమారు 93 మందికి పైగా ప్రాణాలు బలిగొన్న అతడు బుధవారం (డిసెంబర్ 30,2020) మరణించాడని కాలిఫోర్నియా కరెక్షన్స్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌ డిపార్టుమెంట్‌ ప్రకటన విడుదల చేసింది. 80 ఏళ్ల వయస్సున్న సామ్యూల్‌ వయోభారంతో చనిపోయినట్లు సమాచారం.

దక్షిణ అట్లాంటాకు సమీపంలో గల రెనాల్డ్స్‌(జార్జియా)లో 1940, జూన్‌ 7న సామ్యూల్‌ లిటిల్‌ జన్మించాడు. టీనేజర్‌ అయిన అతడి తల్లి పసివాడుగా ఉన్నపుడే తనను బంధువుల ఇళ్లలో వదిలివెళ్లడంతో సామ్యూల్‌ బాల్యం అత్యంత కఠినంగా గడిచింది. ఒంటరితనం వెంటాడింది. దీంతో మంచి చెడులు చెప్పేవారు లేక..ప్రేమను పంచేవారు లేక నేరాలకు చిన్న దొంగతనాలకు అలవాటు పడి అలా అలా నేరాలు చేయటం మొదలు పెట్టి చివరు కరడు కట్టిన నేరస్థుడిగా మారాడు. దయాదాక్షిణ్యాలు లేని కిరాతకుడొగా మారాడు.

చిన్ననాటే ఓ విచిత్ర ఘటనలో నేరాల బీజం పడింది సామ్యూల్‌కు. సామ్యూల్ ఐదో తరగతిలో ఉన్నపుడు ఓ టీచర్‌ తన మెడను రుద్దుకున్నప్పనుంచి అతడికి ఎవరి మెడను చూసినా గట్టిగా నొక్కేయాలని అనిపించేదట. ఎవరి మెడలు చూసినా అవే ఆలోచనలు వచ్చేవట. ఆమెడల్ని మెలిపెట్టేయాలన్నంతగా ఉండేదట. ఆ కోరిక అలా అలా పెరిగిందే తప్ప తగ్గలేదు.

ఆ సమయంలో తన పక్కనే ఉన్న తోటి విద్యార్థినిని చంపడానికి అనేకసార్లు ప్రయత్నించి విఫలమైయ్యానని ఇటీవల సామ్యూల్‌ చెప్పుకొచ్చాడు. అలా చిన్ననాటి నుంచే నేర ప్రవృత్తికి అలవాటు పడిన సామ్యూల్‌… పదమూడేళ్ల వయస్సులో దొంగతనం చేసి పోలీసుల చేతికి చిక్కాడు. అలా అలా చిన్న చిన్న దోపిడీల నుంచి మొదలైన అతని నేర జీవితం కరడు కట్టిన సీరియల్ కిల్లర్ గా మారాడు.

సీరియల్‌ కిల్లర్‌గా 93 మంది మహిళల్ని అత్యం కిరాతకంగా చంపేశాడు. చంపిన తరవాత మృతుల ఒంటిపై ఉన్న బంగారం వంటి విలువైన వస్తువులు లాక్కుని వారి మృతదేహాలను నిర్లక్ష్యంగా పారేసేవాడు. అలా ఎన్నో శవాలను పొదల్లో పడేసి అక్కడి నుంచి క్షణాల్లో మాయం అయిపోయేవాడు.

పక్కా ప్రొఫెషనల్ కిల్లర్ గా మారిన సామ్యూల్ పోలీసులకు ఎటువంటి క్లూస్ చిక్కనిచేవాడు కాదు. అంత పక్కాగా హత్యలు చేసేవాడు. ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరక్కుండా వరుస హత్యలు చేశాడు. అలా ఒకేరోజున ఏడు హత్యలు చేశాడంటే అతని ఎంతటి భయంకరమైన నేరస్థుడో అర్థం చేసుకోవచ్చు.

హత్యలు చేస్తే దొరకని సామ్యూల్ చిన్నా చితక దొంగతనాలు, దోపిడీలు చేస్తూ దొరికిపోయి అప్పుడప్పుడూ అరెస్టైనా వెంటనే బెయిలు మీద బయటకు వచ్చేవాడు. కానీ హత్యల గురించి మాత్రం పోలీసులకు తెలిసేది కాదు. పలు దొంగతనాలు చేస్తున్నాడనే కారణంతో పోలీసులు మాత్రం అతడిపై నిఘా వేసే ఉంచారు. ఈ క్రమంలో ఓ హత్య కేసులో దొరికాడు. అనంతరం అతని నేర జీవితం గురించి విచారించగా అతను చేసిన మొత్తం హత్యల చిట్టా చెబుతుంటే పోలీసులే ఆశ్చర్యపోయారు.

అలా ఒకానొక హత్య కేసులో లభించిన ప్రాథమిక ఆధారాలతో 2014లో అతడిని అరెస్టు చేశారు. డీఎన్‌ఏ టెక్నాలజీని ఉపయోగించి నేరాన్ని రుజువు చేయడంతో స్థానిక కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష(లు) విధించింది. అప్పటి నుంచి కాలిఫోర్నియాలోని జైలులో సామ్యూల్‌ శిక్ష అనుభవిస్తున్న సామ్యూల్‌ బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు ఛేదించలేక సామ్యూల్‌తో ఆ నేరాలు చేసినట్లు పోలీసులు ఒప్పించారనే విమర్శలు వినిపించాయి. అయితే సామ్యూల్‌ మాత్రం తాను యువకుడిగా ఉన్న సమయంలో ఎలా హత్యలు చేశానన్న అంశం గురించి పూసగుచ్చినట్లు వివరించి సామాన్యులతో పాటు పోలీసులు, న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని కూడా ఆశ్చర్యపరిచాడు. కానీ ఎంత కరడు కట్టిన నేరస్థుడైనా మరణానికి అతీతుడు కాదు కదా..అలా సామ్యూల్ చనిపోయాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *