ఇసుక లారీని అడ్డుకున్నాడని లారీతో తొక్కించి చంపేశారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా దౌర్జన్యానికి ఓ రైతు ప్రాణాం బలైపోయింది. తన పొలం నుంచి ఇసుక రవాణా చేయవద్దంటూ అడ్డుకోబోయిన నరసింహులు అనే రైతును లారీతో తొక్కించి చంపేశారు. ఆ తర్వాత ఏమి తెలియనట్టు ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. రాజాపూర్ మండలం తిరుమలాపూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నవారి అండదండలతో మనుషుల ప్రాణాలను కూడా తీసే స్థాయికి ఇసుకాసురులు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలాపూర్‌ గ్రామం మీదుగా గత కొంత కాలంగా ఇసుక రవాణా కొనసాగుతోంది. గుర్రం కాడ నరసింహులు అనే రైతు పొలం మీదుగా ఈ అక్రమ రవాణా చేస్తున్నారు. దీంతో తన పంట పాడు అవుతోందని లారీలు వెళ్లవద్దంటూ ఎంతగానో చెప్పిచూశాడు.కానీ అతని మాటను లెక్కచేయకుండా ఇసుక తరలింపు కొనసాగించారు.

ఈ విషయం అధికారలకు చెప్పినా వారు పట్టించుకోకపోవటంతో సదరు రైతు తనపొలం మీదుగా తరలిస్తున్న ఇసుక లారీని ఓ రోజు రైతు అడ్డుకున్నాడు. దీంతో ఇసుకాసురుుల ఏమాత్రం ఆలోచించకుండా..అతన్ని లారీతో ఢీ కొట్టారు. తీవ్ర గాయాలతో రైతు అక్కడికక్కడే చనిపోయాడు. ఇసుక మాఫియా చేతిలో దారుణ హత్యకు గురికావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇంత దారుణం జరిగినా అధికారులు మాత్రం పట్టించుకోలేదని మృతుడి కటుుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా ఆరోపించారు. ఈ దారుణ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..కరనో డ్యూటీలో ఉన్నారనీ..హత్య విషయం తమకు తెలియదంటూ సమాధానం ఇస్తున్నారు అధికారులు. కానీ అధికారులు..పోలీసులు ఇసుక మాఫియావాకికి అండగా ఉండటం వల్లనే ఈ హత్యకు కూడా పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసి నరసింహులు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts