Home » Kannada Drug Case: CCB విచారణకు అకుల్ బాలాజీ, ఆర్యన్ సంతోష్..
Published
4 months agoon
By
sekharSandalwood drug case: డ్రగ్స్ కేసు.. కన్నడ చిత్రపరిశ్రమను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రాగిణి ద్వివేది, సంజన గల్రాని అరెస్టు అయ్యారు. న్యాయస్థానం వారిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం వారు బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొంటున్నారు.
శాండల్‌వుడ్ స్టార్ హీరో దిగంత్, ఆయన భార్య, నటి ఐంద్రితా రాయ్‌లను విచారించిన సీసీబీ పోలీసులు తాజాగా పాపులర్ యాక్టర్, యాంకర్ అకుల్ బాలాజీ, నటుడు ఆర్యన్ సంతోష్‌లకు నోటీసులు జారీ చేసింది. రేపు (సెప్టెంబర్ 19)న విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది.
పర్సనల్ వర్క్ మీద మైసూరులో ఉన్న ఆర్యన్.. తనకు డ్రగ్స్ వ్యవహారంతో ఎలాంటి సబంధం లేదని.. విచారణకు సహకరిస్తానని సీసీబీ పోలీసులను కాస్త సమయం అడిగాడని సమాచారం.
లాక్డౌన్ సమయంలో అకుల్ బాలాజీ తన స్నేహితులతో కలిసి ఫామ్‌హౌస్‌లో పార్టీ చేసుకున్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగించారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారట.
వీరితో పాటు కార్పొరేటర్ ఆర్.డి.దేవరాజ్ తనయుడు యువరాజ్‌కు కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారు.