అన్నేసి ఆస్తులు ఎక్కడివి? రాగిణి, సంజనలపై పోలీసుల ప్రశ్నల వర్షం..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Sandalwood Drug Case update: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం పలు సినీ పరిశ్రమల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే కన్నడనాట హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విచారణలో భాగంగా వారు సినీ రంగంలో పలు విభాగాలకు చెందిన పలువురు పెద్దల పేర్లు చెప్పినట్టు సమాచారం.రాగిణి, సంజన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని తెలుసుకునేందుకు వారి బ్లడ్, హెయిర్ శ్యాంపుల్స్ ల్యాబ్‌కు పంపారు పోలీసులు.అయితే వీరిద్దరూ పరీక్షకు సహకరించకుండా నానా గొడవ చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇదిలా ఉంటే రాగిణి, సంజనలకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉండడంపై కూడా సీసీబీ పోలీసులు దృష్టిసారించారు. తనకు నగరంలో పది ఫ్లాట్లు ఉన్నట్లు సంజన చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారట. నటించింది తక్కువ సినిమాలే మరి అన్నేసి ఆస్తులు ఎలా సంపాదించారు?.. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చిన డబ్బును హవాలా రూపంలో తరలించారా?.. అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.మరోవైపు తెలుగు ఇండస్ట్రీలోనూ గతంలో డ్రగ్స్ కేసు విషయమై పెద్ద సంచలనమే రేగింది.. ఇప్పుడు తిరిగి బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లింక్ బైటపడటం హాట్ టాపిక్‌గా మారింది.. రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ పేరు బయట పెట్టడంతో టాలీవుడ్‌లోనూ ఈ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి…


Related Posts