Home » డ్రగ్ టెస్ట్‌లో రాగిణి ద్వివేది చీటింగ్.. ఏం చేసిందటే..
Published
4 months agoon
By
sekharSandalwood Drugs Rocket- Ragini Dwivedi Cheating in Drug Test: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వీరిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు విచారిస్తున్నారు. డోప్ టెస్టు నిమిత్తం వీరిని గురువారం బెంగళూరులోని కేపీ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే డోప్ టెస్ట్ కోసం ఇచ్చిన యూరిన్ శాంపిల్‌లో రాగిణి చీటింగ్‌కు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. తన యూరిన్ శాంపిల్‌లో రాగిణి కొంత నీటిని మిక్స్ చేసిందట. రాగిణి ఇచ్చిన యూరిన్ శాంపిల్‌లో నీరు ఉండడాన్ని వైద్యులు కనుగొన్నారట. దీంతో రాగిణి నుంచి మరోసారి యూరిన్ శాంపిల్ తీసుకుని టెస్ట్‌కు పంపినట్టు తెలుస్తోంది.
రాగిణి, సంజన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని తెలుసుకునేందుకు వారి బ్లడ్, హెయిర్ శ్యాంపుల్స్ ల్యాబ్‌కు పంపారు పోలీసులు.అయితే వీరిద్దరూ పరీక్షకు సహకరించకుండా నానా గొడవ చేసిన సంగతి తెలిసిందే.