Home » ఐశ్వర్య రాయ్ నా తల్లి.. యువకుడి ఆరోపణలు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..
Published
1 month agoon
Aishwarya Rai Bachchan: మాజీ ప్రపంచ సుందరి, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కోడలు, అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్ నా తల్లి అంటూ ఓ యువకుడు చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో ఈ న్యూస్ హల్ చల్ చేస్తోంది.
32 ఏళ్ల సంగీత్ కుమార్ అనే వ్యక్తి ఐశ్వర్య రాయ్ తన కన్న తల్లి అని, ఆమెకు అతను మొదటి సంతానమని.. అతను పుట్టినప్పుడు ఐశ్వర్య రాయ్ వయసు పదిహేనేళ్లని చెప్తున్నాడు. తన తండ్రి తనను లండన్ నుండి విశాఖపట్నం తీసుకురాగా.. రెండేళ్ల పాటు ఐశ్వర్య రాయ్ తల్లిదండ్రులు తన బాగోగులు చూసుకున్నారని తర్వాత తన బర్త్ సర్టిఫికెట్స్ వంటి ఆధారాలన్నీ చించేశారని ఆరోపిస్తున్నాడు.
ఇప్పుడు ముంబై వెళ్లిపోయి తన తల్లి ఐశ్వర్య రాయ్‌తో కలిసి జీవించాలని ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. కాగా అతను పబ్లిసిటీ కోసం ఐశ్వర్య రాయ్ తన తల్లని చెప్పుకుంటున్నాడని, అనవసరంగా ఇలాంటి ఆరోపణలు చేసే వారిని జైల్లో పెట్టాలని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం సంగీత్ కుమార్‌కి మతిస్థిమితం లేదని చెప్తున్నారు. ఈ వ్యవహారంపై ఐశ్వర్య రాయ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.