లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

సంక్రాంతి సెలవులు ముగిశాయి..హైదరాబాద్‌కు ప్రజలు తిరుగుప్రయాణం

Updated On - 9:55 am, Mon, 18 January 21

People return to Hyderabad : సంక్రాంతి సెలవులు ముగిశాయి. పండుగకు హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున సొంతూళ్లకు వెళ్లారు. కరోనా వైరస్ కారణంగా ఈసారి రైళ్లు, బస్సుల్లోనే కాకుండా సొంత వాహనాల్లో ఆంధ్రాకు ప్రయాణమై వెళ్లిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సెలవులు ముగియడం, పైగా వారాంతం కావడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. దీంతో.. హైదరాబాద్ వైపు వెళ్లే 65వ జాతీయ రహదారిపై వాహనాలు రద్దీ పెరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున స్పెషల్ బస్సులు నడుపుతున్నాయి. బస్సుల్లో కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. కార్లు, బస్సులతో టోల్‌ప్లాజాల వద్ద భారీ రద్దీ నెలకొంది.

హైదరాబాద్ వైపు 9, విజయవాడ వైపు 5 టోల్ గేట్స్ ఓపెన్‌లో ఉన్నాయి. అలాగే నల్లగొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు 7, విజయవాడ వైపు 5 గేట్స్ తెరిచి ఉన్నాయి. ఈ టోల్‌గేట్లన్నింటి దగ్గర వాహనాలు బారులు తీరాయి. అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై మాడ్గులపల్లి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు 6, అద్దంకి వైపు 4 గేట్స్ ఓపెన్‌లో ఉన్నాయి.