Sankranthi Special Items

సంక్రాంతి ఫుడ్ : నువ్వుల బర్ఫీ, తేగల లడ్డూ తయారీ.

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఘుమఘుమలాడే ఈ పిండి వంటలతో సంక్రాంతిని మరీంత ఎంజౌయి చేద్దం. సంక్రాంతి పండుగలో వందల రకాల పిండి వంటలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం…

ఘుమఘుమలాడే ఈ పిండి వంటలతో సంక్రాంతిని మరీంత ఎంజౌయి చేద్దం. సంక్రాంతి పండుగలో వందల రకాల పిండి వంటలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం…

నువ్వుల బర్ఫీ:
ప్రతి ఒక్కరి ఇంట్లో వండే పిండి వంటల్లో కామన్ గా ఉండే ఐటమ్స్ కాకుండ నువ్వుల బర్ఫీ లాంటి కొత్త ఐటమ్స్ చేద్దాం.
కావాల్సిన పదార్ధాలు :
నువ్వులు మూడు కప్పులు, పంచదార రెండు కప్పులు , పల్లీలు కప్పు, ఎండుకొబ్బరితురుము అరకప్పు, జీడిపప్పు కొద్దిగా, నెయి రెండు స్పూన్లు.
తయారీ విధానం:
నువ్వులు,పల్లీలను నూనె లేకుండా విడివిడిగా వేయించుకోవాలి. వాటి వేడి చల్లారాక నువ్వుల్ని పొడి చేసుకున్న తరవాత పల్లీలను కూడా పొట్టు తీసేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు మందంగా ఉండే గిన్నెలో పంచదార మునిగేవరకూ నీళ్ళు పోసుకుని తీగపాకం వచ్చే వరకూ ఆగాలి. అప్పుడు ముందుగా చేసుకున్న పొడులతో పాటూ మిగిలిన పదార్ధాలన్నీ వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మధ్య మధ్య లో కొద్దిగా నెయ్యి వేస్తే మిశ్రమం చేతులకు అంటుకోకుండా వస్తుంది. అది దగ్గరపడ్డాక దింపేయాలి. దీన్ని నెయ్యిరాసిన పళ్లెంలోకి తీసుకుని చల్లారాక బిళ్లల్లా కట్ చేసుకుని పైన జీడిపప్పు అద్దుకుంటే సరిపోతుంది. 

తేగల లడ్డు:
ఇవి పిల్లలకి మంచి హెల్ధీ ఫుడ్. తియ్య తియ్యగా ఉండటంతో పిల్లలు విటిని ఎంతో ఇష్టంగా తింటారు.
కావాల్సిన పదార్ధాలు: 
కాల్చిన తేగలు ఐదు, అటుకులు కప్పు, ఎండుకొబ్బరిపొడి అరకప్పు, చక్కరపొడి కప్పు, యాలకులపొడి చెంచా, నెయ్యి అరకప్పు లేదా ముప్పావుకప్పు 
తయారీ విధానం:
తేగల్ని పీచు తీసుకుని కొబ్బరిలా తురుముకోవాలి. అటుకుల్ని పొడి చేసుకోవాలి. నెయ్యి తప్ప మిగిలిన పదార్ధాలన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరవాత నెయ్యి వేసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇవి నాలుగైదు రోజులు తాజాగా ఉంటాయి.
   

Related Posts