sankranti bhogi mantalu in ap, telangana

భోగి మంటలతో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపేడే విధంగా సంబరాలు జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా భోగి మంటలతో పండుగను జరుపుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలంతా భోగి మంటల దగ్గరి వచ్చి చలి కాచుకుంటున్నారు. భోగి మంటలు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతున్నారు.

కోస్తా జిల్లాలో భోగి సంబరాలు మొదలయ్యాయి. పాత వస్తువులు, దుంగలతో భోగి మంటలు వేస్తున్నారు. ఏలూరు, ఒంగోలులో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి మంటలతో సంక్రాంతి పడుగను ప్రారంభించారు. ఒంగోలులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి మంటల వేడుకల్లో మంత్రి బాలినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండుగ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఉన్నా కూడా సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చి పండుగ చేసుకునే ఆనవాయితీ ఉందని తెలిపారు.

గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో భోగి మంటలు వేశారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదిక ప్రతులను భోగి మంటల్లో వేసి ఎంపీ గల్లా జయదేవ్, మాగంటి బాబు, శ్రావణ్ కుమార్ నిరసన తెలిపారు. మాగంటి బాబు భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. జై అమరావతి..జైజై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

పల్లెల్లోనే కాదు.. పట్నంలోనూ భోగి సంబరాలు జరిగాయి. హైదరాబాద్‌ సిటీలోని పలు చోట్ల భోగి మంటలు వేసి మూడు రోజుల సంక్రాంతి పండగకు స్వాగతం పలికారు. చిన్న పెద్దా అంతా కలిసి భోగి మంటలతో చలి కాచుకున్నారు. భోగి మంటల వెలుగుల్లో ఆడపడుచులు రంగవల్లులు వేశారు. 

Related Tags :

Related Posts :