లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ.. ‘సప్త స్వర క్రియేషన్స్’ ప్రారంభం..

Published

on

Sapta Swara Creations: విజయ దశమి కానుకగా టాలీవుడ్‌లో మరో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. గత 20 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో వర్క్ చేస్తూ ఏడు సంవత్సరాల నుంచి పలు సక్సెస్‌ఫుల్ చిత్రాలకు డిఓపిగా పని చేసిన వాశిలి శ్యామ్ ప్రసాద్.. సప్త స్వర క్రియేషన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు.


బ్యానర్‌ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చెడుపై మంచి సాధించిన రోజు దసరా. అమ్మ ఆశీస్సులతో కరోనా మహమ్మారి నుంచి ప్రజలు కోలుకుంటున్న వేళ విజయ దశమి శుభ సందర్భంగా మా బ్యానర్‌ను స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా వుంది. ప్రేక్షకులని అలరించే యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు యూత్‌ని అట్రాక్ట్ చేసే ప్రేమ కథా చిత్రాలు మరియు ఇంటిల్లి పాది చూసే కుటుంబ కదా చిత్రాలు నిర్మించాలన్నదే మా సప్త స్వర క్రియేషన్స్ సంస్థ సంకల్పం.

సోషల్ మీడియాను షేక్ చేస్తామంటున్న ప్రభాస్, తారక్ ఫ్యాన్స్!


సంవత్సరానికి 4 సినిమాలు నిర్మించాలనే కృత నిశ్చయంతో ఉన్నాము. అలాగే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయగల సినిమాలకు రూపకల్పన చేయగల టాలెంట్ వున్న నటీనటులకు, టెక్నీషియన్స్‌కు అవకాశం కల్పించడం కూడా మా ప్రధాన ఉద్దేశ్యం. మా సంస్థ చేపట్టబోయే ప్రాజెక్ట్స్ వివరాలను త్వరలో తెలియజేస్తాము..’’ అన్నారు.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *