లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘సర్కారు వారి’ సాలిడ్ పాట.. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కోసం చెమటోడుస్తున్న సూపర్‌స్టార్..

Published

on

Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ కోసం మహేష్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు.. గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్ బాడీతో మరింత స్టైలిష్ లుక్‌లోకి మారిపోయాడు. మహేష్ కసరత్తులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Sarkaru Vaari Paata

ఈ సినిమాలో మహేష్ పక్కన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలో అబ్రాడ్‌లో దాదాపు 50 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

Sarkaru Vaari Paata

ఇదిలా ఉంటే మహేష్ కెరీర్లో మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా లెవల్లో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి..