సరోజ్ ఖాన్ హాస్పిటల్ ఖర్చులు భరించిన సల్లూ భాయ్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ముంబైలోని గురునానక్ ఆసుపత్రిలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ గుండెపోటుతో క‌న్నుమూసిన విష‌యం విదిత‌మే. ఆమె మృతి చిత్ర పరిశ్రమకు తీర‌నిలోటు అంటూ బాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. జూన్ 24 న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్ప‌డ‌టంతో కుటుంబ సభ్యులు సరోజ్ ఖాన్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. అంత‌కుముందు సరోజ్‌ ఖాన్ డయాలసిస్‌ చేయించుకున్నారు.

Saroj Khan

మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం సరోజ్‌ ఖాన్ వైద్య చికిత్సకు అయిన‌ ఖర్చును సల్మాన్‌ఖాన్‌ ఫౌండేషన్ భరించింది. అలాగే సల్మాన్ ఖాన్ సోదరి అల్విరా అగ్నిహోత్రి కూడా సరోజ్‌ఖాన్ చికిత్సకు ఆర్థిక‌సాయం అందించారు. సల్మాన్‌ఖాన్ చిత్ర‌ ప‌రిశ్ర‌మ‌లో అవ‌స‌ర‌మైన‌వారికి స‌హాయం అందిస్తుంటారు. ఆమ‌ధ్య స‌రోజ్‌ ఖాన్ త‌న‌కు అవ‌కాశాలు దొర‌క‌డం లేద‌ని స‌ల్మాన్‌ను క‌లిశారు. దీంతో ఆయ‌న త‌న తదుపరి చిత్రంలో అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. సల్మాన్ న‌టించిన ‘బీవీ హోతో ఐసీ, అందాజ్‌ అప్నా అప్నా’ త‌దిత‌ర చిత్రాల‌కు స‌రోజ్‌ ఖాన్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.

Read:ఛాలెంజ్ పూర్తి చేసిన శిరీష్..

Related Posts