లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలోనే కరోనావైరస్ వేగంగా సోకుతుందంట.. అసలు కారణం ఇదే!

Updated On - 10:47 am, Sat, 23 January 21

SARS-CoV-2 needs cholesterol : అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలోనే కరోనావైరస్ వేగంగా సోకుతోందని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. ఎందుకంటే.. కోవిడ్-19ను వ్యాప్తిచేసే SARS-CoV-2 అనే వైరస్‌కు మెగా కణాలను ఉత్పత్తి చేసుకోవాలంటే అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ అవసరమంట.. అందుకే శరీరంలోకి ప్రవేశించగానే ముందుగా కణాలపై దాడి చేసి.. వాటి స్థానంలో తమ మెగా కణాలను ఉత్పత్తి చేసుకుంటాయని అధ్యయనంలో తేలింది.

అధిక కొవ్వు నిల్వలపైనే ఈ కరోనావైరస్ ఆధారపడుతుంది. కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఔషధాలను తీసుకునే వ్యక్తుల్లో కరోనావైరస్ సోకినా ఇతరులకన్నా మెరుగ్గా ఉంటారని పేర్కొంది. కణాలపై రక్షిత పొరను దాటేందుకు వైరస్ కొవ్వు అణువుపై ఆధారపడుతుంది. కోవిడ్ వ్యాప్తి చేయడాలంటే SARS-CoV-2 వైరస్ శరీరంలోని కణాలలోకి ప్రవేశించవలసి ఉంటుంది. దీనికి కొలెస్ట్రాల్ వాహకం అవసరం.. కొలెస్ట్రాల్ కణాలు.. వైరస్ కణాలను సులభంగా తెరిచి లోపలికి వెళ్లేందుకు సాయపడుతుంది. కొలెస్ట్రాల్ లేకుండా.. వైరస్ సెల్ రక్షిత అవరోధాన్ని దాటలేదు.

వ్యాధిని చేయలేదని సైంటిస్టులు అధ్యయనంలో గుర్తించారు. అయితే SARS-CoV-2 వైరస్ కొలెస్ట్రాల్‌‌ ఆధారిత కణాలలోకి ప్రవేశించకుండా మందులు నిరోధించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కరోనా బాధితుల ఊపిరితిత్తులలో కొలెస్ట్రాల్ ఆధారంగా వైరస్.. మెగా కణాలుగా ఉద్భవించడాన్ని సూక్ష్మదర్శిని ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్ మెగా కణాలు ఒకదానికొకటి చుట్టుముట్టడతాయి.

గుడ్లు ఒక గిన్నెలో పగిలినట్లుగా మారి ఇతర కణాలకు వెదజల్లుతాయి. కరోనా రోగుల ఊపిరితిత్తులలో కనిపించే మెగా కణాలు ఎలా ఏర్పడతాయో సైంటిస్టులు విశ్లేషించారు. సిన్సిటియా ఏర్పడటం చాలా హానికరమని, ఇది ఊపిరితిత్తుల కణజాలాలను నాశనం చేస్తుందని, తద్వారా మరణానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.