బ్లాక్ బస్టర్ కన్నడ మూవీ తెలుగు రీమేక్‌లో!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తనదైన శైలిలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో సత్య దేవ్. ఇక తెలుగునాట మిల్కీ బ్యూటీ తమన్నాకున్న స్టార్ డం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ జంటగా కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘లవ్ మాక్‌టైల్(Love Mocktail)’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది.

 

Love Mocktail

నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్:1గా భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ప్రాజెక్ట్‌ తెరకెక్కిస్తున్నారు. ‘లవ్ మాక్‌టైల్’ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మధ్యలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శక నిర్మాత నాగ శేఖర్ తెలిపారు. అలానే ఈ చిత్రానికి హ్యాపెనింగ్ మ్యూజిక్ సెన్సేషన్ స్వరవాణి కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని దర్శక నిర్మాత నాగ శేఖర్ అన్నారు.

Related Posts