లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సౌదీ రాజు

Published

on

Saudi King First Dose Coronavirus Vaccine: సౌదీ రాజు సల్మాన్ (85) కరోనావ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నారు. రెడ్ సీ సిటీలోని NEOM ఎకనామిక్ జోన్‌లో శుక్రవారం (జనవరి 8)న ఆయన కరోనా టీకా తొలి మోతాదును తీసుకున్నారని స్థానిక వార్త సంస్థ నివేదించింది. సౌదీ రాజు సల్మాన్ కరోనా టీకా వేయించుకుంటుండగా తీసిన రెండు ఫొటోలతో పాటు ఒక వీడియోను కూడా షేర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలలో సౌదీ రాజుకు వైద్య సిబ్బంది కరోనా టీకా వేస్తున్నట్టుగా ఉన్నాయి.

సౌదీ అరేబియాలో డిసెంబర్ 17న కరోనావైరస్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఫైజర్-బయెంటెక్ వ్యాక్సిన్ నుంచి తొలి రవాణా అనంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మూడు విడతల్లో ప్రవేశపెట్టనున్నట్టు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో భాగంగా ముందుగా 65ఏళ్లు ఆపైబడినవారితో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, హైరిస్క్ కేటగిరీలోనివారికి ఈ వ్యాక్సిన్ అందిస్తున్నారు.

మరో విడతలో 50ఏళ్ల వయస్సువారికి కరోనా టీకాను అందించనున్నారు. చివరిగా మూడో విడతలో మిగిలిన ప్రతిఒక్కరికి కరోనా టీకా అందించనున్నట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది. సౌదీ పౌరులు, నివాసులకు కరోనా టీకా ఉచితంగా అందించనున్నట్టు పేర్కొన్నారు.

సౌదీ అరేబియాలో కరోనా వైరస్ కేసులు 363,000 కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఇందులో 6వేల కరోనా మరణాలు సంభవించాయి. సౌదీ అరేబియాలో 34మిలియన్ల కంటే ఎక్కువగా జనాభా ఉండగా.. హై రికవరీ రేటు నమోదు అయినట్టు అధికారిక గణంకాల్లో వెల్లడైంది.