చేయి కదిపిన ప్రిన్స్ : 15 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు..ఆమె పిలుపుతో కదలికలు..రాజకుటుంబంలో సంబరాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Saudi prince raises his hand after 15 years in a coma : సినిమాల్లో కోమాలో ఉన్న వ్యక్తులు వారికి బాగా ఆత్మీయులు గానీ..అత్యంత శతృత్వం ఉన్నవారి మాటలు వినిపిస్తే సదరు కోమాలో ఉండే పేషెంటులో కదలికలు వచ్చినట్లుగా చూశాం. అటువంటిదే ‘‘సౌదీ అరేబియా యువరాజు అల్ వలీద్ బిన్ ఖాలిద్ అల్ సాద్’’విషయంలో కూడా జరిగింది. గత 15 సంవత్సరాలనుంచి సదీ అరేబియా యువరాజు కోమాలోనే ఉన్నారు. 2005లో కారు యాక్సిడెంట్ కు గురైన అల్ వలీద్ బిన్ ఖాలిద్ అప్పటినుంచి కోమాలోనే ఉండిపోయారు. ఆ తరువాత 2015లో యువరాజు శరీరంలో కొద్దిగా కదలికలు కనిపించాయి.
అప్పటి నుంచి మళ్లీ ఎటువంటి కదలికలు లేకుండా అలాగే అచేతనంగా ఉండిపోయాడు. కానీ యువరాజు ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మార్పు వస్తున్నట్లుగా కనిపిస్తోంది. తన చేతిని కదిలించగలిగారు. కాస్త పైకి కూడా చేతిని లేపగలిగారు. దానికి కారణం ఓ మహిళ పిలుపే కారణమని డాక్టర్లు చెబుతున్నారు.

కాగా..యువరాజు కోమాలోకి వెళ్లిననాటినుంచి చికిత్స కొనసాగుతునే ఉంది. ఎంతోమంది పేరు మోసిన డాక్టర్లు యువరాజకు చికిత్సనందించారు.కానీ ఫలితం లేదు.ఎన్నో ప్రార్థనలు చేయించేవారు.మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు చేయించేవారు రాజకుటుంబీకులు. కానీ ఏమాత్రం ఫలితం లేదు. కోమాలోంచి కోలుకోలేదు.
ప్రస్తుతం కోమాలో ఉన్న యువరాజు అల్ వలీద్ వయసు 47 సంవత్సరాలు. ఆయన మిలిటరీ కాలేజిలో చదువుకుంటున్న సమయంలో కారు ప్రమాదానికి గురయ్యారు. ఆ యాక్సిడెంట్ కారణంగా ఆయన మెదడులో రక్తస్రావం కావటంతో కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి అతనికి చికిత్స కొనసాగుతునే ఉంది. కానీ ఆరోగ్యం పరిస్థితిలో పెద్దగా మార్పులేమీ జరగలేదు.
ఆయన కుటుంబం సభ్యులు.. బంధువులు..ఆత్మీయులు పలుకరిస్తూనే ఉండేవారు. కానీ ఎటువంటి మార్పులేదు. కానీ ఇటీవల ఆయన తన చేతిని కదిలించడంతో సౌదీ రాజకుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సౌదీ యువరాణి నౌరా బిన్ తలాల్ అల్ సాద్… మరికొందరు యువరాజును పలకరించే ప్రయత్నం చేస్తుండగా..ఆయన చేతిని పైకి లేపారు. అలా రెండోసారి మూడో సారి కూడా తన చేతి వేళ్లను కదిపారు. దీంతో సంతోషపడిపోయిన రాజకుటుంబం అతను కోలుకుంటాడని ఆకాంక్షిస్తున్నారు.

అలా ‘‘ఇంకొంచెం పైకి ఎత్తు అంటూ సౌదీ యువరాణి నౌరా బిన్ తలాల్ అల్ సాద్ చెబుతుండగా..ఆయన తన చేతిని మరికాస్త ఎత్తే ప్రయత్నం చేశారు.దీంతో యువరాజు కోలుకోవటానికి ఆయన తన చేతిని కదిలించటానికి సౌదీ యువరాణి నౌరా బిన్ తలాల్ అల్ సాద్ పిలుపే కారణమని నమ్ముతున్నారు రాజకుటుంబీకులు.
5ఏళ్లు కోమాలో ఉన్న జియాంగ్ యాంగ్

కాగా చైనాలోని హుబీ ప్రావిన్స్ కు చెందిన జియాంగ్ యాంగ్ అనే వ్యక్తి 2013లో బైక్ పై వెళుతూ ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య జాంగ్ అతనికి సమర్యలు చేసేది. భర్తలో కదలికలు లేకపోయినా తాను భర్తతో చెప్పాలనుకున్నవన్నీ ఆయనకు సమర్యలు చేస్తూ..పక్కనే కూర్చుని అన్ని విషయాలు చెప్పేది.


తనకోసం భర్త తిరిగి కోలుకుంటాడని ఆమె నమ్మేది. అలా రోజుకు కొన్ని గంటలు మాత్రమే నిద్రపోయి మిగిలిన సమయం అంతా భర్త పక్కనే కూర్చుని అతన్ని చూస్తూ ఎన్నో విషయాలు చెబుతుండేది. తన మాటల్ని భర్త వింటున్నాడని నమ్మేది. అలా తన యత్నాన్ని మానేదికాదు. అలా ఆమె ఆరోగ్యం పాడైంది. 10కిలోలకు పైగా బరువు తగ్గిపోయింది. అయినా సరే భర్తతోనే లోకం అన్నట్లు గా ఆయన పక్కనే కూర్చునేది. ‘‘నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను..నీ పిలుపు కోసం వేచి చూస్తున్నాను’’అంటూ చెప్పేది.


అతనికి ఇష్టమైన పాటలు పెట్టి వినిపించేది. మంచి మంచి పుస్తకాలు చదివి వినిపించేది. అలా ఆమె ప్రయత్నం..తపన ఫలించాయి. భర్త ఐదు ఏళ్లకు కోమాలోంచి బైటకొచ్చాడు.

Related Tags :

Related Posts :