Polavaram Project : బాబు ఏం చేశారు ? REC బహిర్గతం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Polavaram  : ఏపీ రాష్టంలో ప్రాజెక్టుగా..మాజీ సీఎం చంద్రబాబు చేసిన విషయాలను కేంద్ర జల్ శక్తి ఆర్థిక సలహాదారు జగన్ మోహన్ గుప్తా..నేతృత్వంలోని రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ (Revised Cost Committee (RCC)) బహిర్గతం చేసింది. నీటి పారుదల విభాగానికి అయ్యే ఖర్చును విడుదల చేస్తే చాలని కేంద్రాన్ని చంద్రబాబు అభ్యర్థించారని వెల్లడించింది.




2014 ఏప్రిల్‌ 1 నాటికి ప్రాజెక్టులో మిగిలిన నీటిపారుదల వ్యయం రూ.8,006.18 కోట్లేనని.. ఆ మేరకు కేంద్రం నిధులు ఇచ్చేసిందని వెల్లడించడంపై సీఎం జగన్‌ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. విభజన చట్టం సెక్షన్‌90(4) ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఎంత వ్యయమైతే అంత ఖర్చు కేంద్రమే భరించాలని స్పష్టం చేసింది.

పోలవరం పనులను సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రక్షాళన చేయడం, రివర్స్‌ టెండర్ల ద్వారా రూ.838 కోట్లను ఆదా చేయడం, గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తుండటంతో ఆర్‌ఈసీ సానుకూలంగా స్పందించి 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనాలను రూ.47,725.74 కోట్లుగా ఖరారు చేసింది.




జల విద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు, నీటి పారుదల విభాగం వ్యయం రూ.43,164.83 కోట్లని నిర్ధారిస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖకు మార్చి 6న ఆర్‌ఈసీ నివేదిక ఇచ్చింది.
ఆ నివేదికను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ యథాతథంగా సోమవారం ఆమోదించారు. బాబు సర్కార్‌ చేసిన నిర్వాకం దానిపై ఏపీ ప్రభుత్వం..పోరాటం చేయకపోతే..రాష్ట్ర ఖజానాపై రూ.36 వేల కోట్లకు పెనుభారం పడేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.




2010–11 ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.16,010.45 కోట్లు. ఏప్రిల్‌ 1, 2014 నాటికి రూ.5,135.87 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.
జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు వ్యయం రూ.2,868.40 కోట్లు పోనూ మిగిలిన రూ.8,006.18 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం పరోక్షంగా తేల్చి చెప్పింది.
2014 ఏప్రిల్‌ 1 నాటికి మిగిలిన నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్‌ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి 2016 సెప్టెంబర్‌ 7 అర్థరాత్రి పోలవరం పనులను దక్కించుకున్నారు.
2016 సెప్టెంబరు 8న పోలవరం అంచనా వ్యయాన్ని టీడీపీ సర్కార్‌ పెంచేసి పనులన్నీ సబ్‌ కాంట్రాక్టులపై అప్పగించి కమీషన్లు వసూలు చేసుకుంది.




పోలవరానికి నాబార్డు నుంచి తొలి విడతగా రూ.1,982 కోట్ల రుణాన్ని తీసుకుని ఎన్‌డబ్ల్యూడీఏ, పీపీఏల ద్వారా ఆ చెక్‌ను డిసెంబర్‌ 26, 2016న అప్పటి సీఎం చంద్రబాబుకు నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అందజేశారు.

READ  ఆప్ మేనిఫెస్టో రిలీజ్ :  మోడీ,షాల నుంచి దేశాన్ని కాపాడాలి 

డిసెంబర్, 2018లోగా ప్రాజెక్టును పూర్తి చేయకుంటే.. అప్పటిదాకా విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామని కేంద్రం విధించిన షరతుకు అంగీకరిస్తూ చంద్రబాబు సంతకం చేయడం గమనార్హం.
2018లోగా ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల అప్పటిదాకా కేంద్రం విడుదల చేసిన రూ.6,727.26 కోట్లను రుణంగా పరిగణించింది. వెరసి మొత్తమ్మీద ఖజానాపై రూ.36,750.04 కోట్ల భారం పడింది.
2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,656.87 కోట్లుగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించి ఆర్‌ఈసీకి నివేదిక పంపింది.




సీడబ్ల్యూసీ నివేదికపై పలుమార్లు చర్చించిన ఆర్‌ఈసీ చంద్రబాబు అధికారంలో ఉండగా అర్థరాత్రి కేంద్రంతో చేసుకున్న ఒప్పందాన్ని బహిర్గతం చేస్తూ ఇక నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది.



విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులను కేంద్రం విడుదల చేయాల్సిందేనని ఆర్‌ఈసీకి సీఎం జగన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లతో సీఎం జగన్‌ చర్చించారు.
ఈ క్రమంలో 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఈనెల 6న ఆర్‌ఈసీ నిర్ధారించి ఆమోదించింది.
నీటి పారుదల వ్యయం రూ.43,164.83 కోట్లు, 2014 ఏప్రిల్‌ 1 వరకు పనులకు చేసిన వ్యయం రూ.5,135.87 కోట్లు, ఇప్పటిదాకా కేంద్రం రీయింబర్స్‌ చేసిన నిధులు రూ.8,507.26 కోట్లను మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా రూ.29,521.70 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉంటుంది.

Related Posts