SBI కొత్త ఆన్‌లైన్ స్కీమ్ : లోన్లపై నెలవారీ EMIలపై ఇలా రిలీఫ్ పొందొచ్చు.. చెక్ చేసుకోండి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తమ రుణదారుల కోసం కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది.

ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో తీసుకున్న లోన్లపై ఈఎంఐ వాయిదాలు చెల్లించలేక ఇబ్బంది పడుతుంటారు..

తమ రుణదారులకు ఈఎంఐ చెల్లింలపు నుంచి ఉపశమనం కోసం ఎస్బీఐ రిస్ట్రక్చరింగ్ స్కీమ్ ఆన్ లైన్ పోర్టల్ తీసుకొచ్చింది.ఈ పోర్టల్ ద్వారా రిటైల్ లోన్లు, హోం లోన్లు, ఆటో లోన్లు, విద్య, పర్సనల్ లోన్లపై స్కీమ్ వర్తింపజేసింది.

అంతేకాదు.. లోన్లపై రిలీఫ్ కు సంబంధించి కస్టమర్ల సందేహాలను నివృతి చేయడం కోసం FAQs సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీని ద్వారా రుణదారులు తమ లోన్లపై రిస్ట్రక్చరింగ్ స్కీమ్ కు అర్హత ఉందో లేదో తెలుసుకోవచ్చు.. ఏయే లోన్లపై రిలీఫ్ పొందవచ్చునో చెక్ చేసుకోవచ్చు.

SBI రిటైల్ కస్టమర్లు… ఈ పోర్టల్ ద్వారా వెబ్ సైట్లో Restructuring Scheme విజిట్ చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ లోన్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.మీకు OTP జనరేట్ అవుతుంది. ఓటీపీ వెరిఫై చేశాక అవసరమైన వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత మీకు లోన్ రిలీఫ్ అర్హత ఉందో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది.. 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది.

ఈ వ్యవధిలో కస్టమర్లు తమ దగ్గరలోని ఏదైనా ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది.

బ్యాంకు ద్వారా మరిన్ని వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ డాక్యుమెంట్లు ఒకసారి వెరిఫై అయ్యాక రిస్ట్రక్చరింగ్ లోన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ సౌకర్యాన్ని వ్యక్తిగత రుణదారులకు అందించేందుకు బ్యాంకులకు అనుమతినిచ్చిందని ఓ నివేదిక వెల్లడించింది.

అకౌంట్ రుణదారులకు మాత్రమే అర్హత ఉంది.స్టాండర్డ్ లోన్లు లేదా మార్చి 1, 2020 నుంచి 30 రోజులు కంటే ఈఎంఐలు చెల్లించకపోయినా అది ఎగవేత కాదు..

అది కూడా మహమ్మారి కారణంగా ఆదాయం దెబ్బతిన్నవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.

లోన్ రిస్ట్రక్చరింగ్ అప్లికేషన్లు అప్రూవ్ చేశారా లేదా అనేది సంబంధిత బ్రాంచ్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బ్యాంకులు, NBFCలను సెప్టెంబర్ 15 నాటికి లోన్ రిస్ట్రక్చరింగ్ స్కీమ్ ప్రవేశపెట్టాలని సూచించారు.

ప్రస్తుతం మారటోరియం గరిష్టంగా బ్యాంకు కస్టమర్లకు రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది.

24, డిసెంబర్ 2020 నాటికి రుణదారులు ఈ స్కీమ్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. మార్చి1, 2020 తర్వాత తీసుకున్న లోన్లు ఈ స్కీమ్ కు అర్హత లేదు.

READ  డెబిట్, క్రెడిట్ కార్డులపై RBI కొత్త రూల్స్‌ మీకు తెలుసా?

లోన్ అర్హత కోసం చెక్ చేయండిలా? :
* కస్టమర్లు bank.sbi or sbi.co.in వెబ్ సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ మీ లోన్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.* అథెంటికేషన్ కోసం రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.

* మీ ఎలిజిబులిటీ తెలుసుకునేందుకు అవసరమైన వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

* మీకు Reference Number జనరేట్ అవుతుంది. 30 రోజుల్లోగా SBI బ్రాంచ్ విజిట్ చేయాలి. సంబంధిత వివరాలను పూర్తి చేయాలి.

* బ్రాంచ్ లేదా సీపీసీ.. వెరిఫై చేశాక రిస్ట్రక్చరింగ్ లోన్ అప్రూవ్ అవుతుంది.

రుణదారుల్లో ఎవరికి అర్హత ? :
కరోనా ప్రభావంతో ఆదాయం కోల్పోయిన రుణదారులు మాత్రమే ఈ స్కీమ్ కు అర్హులు..

* ఫిబ్రవరి 2020తో పోలిస్తే.. ఆగస్టు 2020లో ఆదాయం లేదా వేతనం తగ్గినవవారే రిలీఫ్ పొందొచ్చు.* కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో సస్పెండ్ లేదా వేతనం తగ్గినా స్కీమ్ అర్హత ఉంటుంది.

* రుణదారుడి ఉద్యోగం కోల్పోయినా లేదా కంపెనీ మూతపడినా ఈ స్కీమ్ పొందొచ్చు.

* లాక్ డౌన్ సమయంలో ఎలాంటి వ్యాపారపరంగా ఎలాంటి కార్యాకలాపాలు ఆగిపోయినా స్కీమ్ వర్తిస్తుంది.

ఏయే కేటగిరీ లోన్లపై అర్హత ఉంటుందంటే? :
హౌసింగ్ లేదా ఇతర సంబంధిత లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, ఆటో లోన్లు (వాణిజ్యయేతర లోన్లు పర్సనల్ లోన్లు కవర్ అవుతాయి.

Related Posts