చెక్ ఇట్ : SBI లో 2వేల ప్రొబెషనరీ ఆపీసర్ ఉద్యోగాలు… దరఖాస్తులు ప్రారంభం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

SBI PO recruitment 2020: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెుత్తం 2వేల ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మెుత్తం 2వేల ఖాళీల్లో 200 పోస్టుల్ని ఎకనామికల్లీ వికర్ సెక్షన్స్‌కి కేటాయించింది SBI. ఈ పోస్టులకు దరఖాస్తు ప్ర్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. అభ్యర్దులు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.విద్యార్హత : అభ్యర్దులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు.

వయసు : అభ్యర్దుల వయసు ఏప్రిల్ 4, 2020 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్దులకు వయసులో సడలింపులు వర్తిస్తాయి.దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్దులు రూ.750 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం : అభ్యర్దులను ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్దులు జాయిన్ అయ్యే సమయంలో రూ.2 లక్షల బాండ్ రాసి ఇవ్వాలి. బాండ్ ప్రకారం అభ్యర్థులు కనీసం మూడేళ్లు బ్యాంకుకు సేవలు అందించాలి.

పరీక్షా కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి.ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : నవంబరు 14, 2020.
దరఖాస్తు చివరి తేదీ : డిసెంబరు 4, 2020.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ : డిసెంబరు 31, 2020, జనవరి 2, 2021 నుంచి జనవరి 5, 2021.

Related Tags :

Related Posts :